తుంగభద్ర పుష్కరాలకు చంద్రబాబు దూరం

కర్నూలు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు.. తుంగభద్ర పుష్కరాలకు వస్తే.. గతంలో

పుష్కరాలు అంటే 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఎంతో హడావిడి, ఆర్భాటం, సినిమా సెట్టింగ్స్ తరహాలో ప్రపంచం గర్వపడేలా చేశారు. ఇప్పుడు మాత్రం కరోనా కారణంగా తుంగ భద్ర పుష్కరాలు నిబందనల మధ్య సాగుతున్నాయి. నదీ స్నానం లేకపోవటం ఒకటి అయితే.. ఏపీ ప్రభుత్వం కూడా భారీ హడావిడి చేయటం లేదు. భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేసింది కానీ.. వేల కోట్ల రూపాయలు ప్రచారం చేయటం లేదు.

ఏపీ సీఎం జగన్ కర్నూలులో తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించి.. ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. నదికి హారతి ఇచ్చారు. నదిలోకి దిగి నీళ్లు చల్లుకున్నారు. సంప్రదాయ బద్దంగా కార్యక్రమాన్ని ముగించారు. అధికారులు హడావిడి, ఓవరాక్షన్స్ ఏమీ లేకుండా గుడికి వెళ్లినంత ప్రశాంతంగా భక్తులు తుంగభద్ర పుష్కరాలకు వచ్చి వెళుతున్నారు.

రాయలసీమలో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే తుంగభద్ర పుష్కరాలకు చంద్రబాబునాయుడు హాజరుకావటం లేదంట. పార్టీ నుంచి కానీ, ఆయన వ్యక్తిగతంగా కానీ ఆసక్తిగా లేరు అని తెలుస్తోంది. ఈ విషయంపైనే టీడీపీ చర్చించుకుంటుంది. ఇప్పటి వరకు తుంగభద్ర పుష్కరాలపై చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేయకపోగా.. పుష్కరాలకు వెళ్లే ఉద్దేశం లేదని కీలక నేతల దగ్గర ప్రస్తావించారంట. తుంగభద్ర పుష్కరాలకు చంద్రబాబు దూరంగా ఉండటం ఏంటని.. ఓసారి వస్తే బాగుంటుంది అని అంటున్నారంట కర్నూలు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు.

తుంగభద్ర పుష్కరాలకు వస్తే.. గతంలో గోదావరి పుష్కరాల్లో 30 మంది చావు అంశం హైలెట్ అవుతుందని.. సోషల్ మీడియాకు ఈ అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించి.. దూరంగా ఉంటున్నట్లు కీలక నేతలు చెబుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు