చంద్రబాబుకు అత్యవసరంగా కరోనా పరీక్షలు – తిరుపతిలో కలకలం

చంద్రబాబుకు అత్యవసరంగా కరోనా పరీక్షలు - తిరుపతిలో కలకలం

chandra babu take coronora tests
chandra babu take coronora tests

చంద్రబాబుకు అత్యవసరంగా కరోనా పరీక్షలు – తిరుపతిలో కలకలం

టీడీపీ అధినేత చంద్రబాబు ఏప్రిల్ 8వ తేదీ ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి, అచ్చెంనాయుడు, అనిత, సంధ్యారాణి, ఇతర నేతలు ఉన్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది..

ఏప్రిల్ 10వ తేదీ ఉదయం టీడీపీ మహిళా నేత, తిరుమలకు చంద్రబాబుతో వెళ్లిన సంధ్యారాణికి కరోనా పాటిజివ్ అని నిర్థారణ అయ్యింది. దీంతో టీడీపీ అగ్రనేతలు అందరూ షాక్ అయ్యారు. చంద్రబాబుతో కలిసి దర్శనానికి వెళ్లటంతోపాటు.. తిరుమల గెస్ట్ హౌస్ లో టీడీపీ నేతలు అందరితో సమావేశం అయిన సందర్భంలోనూ.. సంధ్యారాణి వారితోనే ఉంది.

సంధ్యారాణికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిన వెంటనే.. అధినేత చంద్రబాబుకు అత్యవసరంగా కరోనా పరీక్షలు చేశారు వైద్యులు. ఆర్టీపీసీ విధానం ద్వారా శాంపిల్స్ సేకరించారు. చంద్రబాబుతోపాటు పనబాక లక్ష్మి, అచ్చెంనాయుడు, అనిత సైతం కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.

చంద్రబాబు బృందంతో కలిసి రెండు గంటలకు పైగానే సంధ్యారాణితో కలిసి తిరిగారు.. మాట్లాడారు.. చర్చించారు. ఇదే ఇప్పుడు టీడీపీ నేతలను టెన్షన్ కు గురి చేస్తుంది. ఇప్పటికే తిరుపతిలో చాపకింద నీరులా కరోనా విస్తరిస్తూ ఉంది. ఏప్రిల్ 9వ తేదీ సైతం 300 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

తిరుపతిలో ప్రచారంలో ఫస్ట్ టైం రాజకీయ నేతలకు కరోనా ఎటాక్ కావటంతో.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన టీడీపీ నేతలను వెంటాడుతుంది. చంద్రబాబుకు కరోనా నెగెటివ్ రావాలని కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు