కొత్త అధ్యక్షుడి ఎన్నికపై బాబు భేటీ.. సమావేశానికి దూరంగా సుహాసిని.. డుమ్మాకొట్టిన కీలక నేత..

కొత్త అధ్యక్షుడి ఎన్నికపై బాబు భేటీ.. సమావేశానికి దూరంగా సుహాసిని.. డుమ్మాకొట్టిన కీలక నేత..

తెలంగాణ రాజకీయాలపై కొంత దృష్టి పెట్టారు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. ఎల్.రమణ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2021, జూలై 10వ తేదీన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నరసింహులు, జోత్స్నా, నర్సిరెడ్డి, అశోక్ గౌడ్ హాజరయ్యారు. కీలకమైన మరో సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి హాజరుకాకపోవటం చర్చనీయాంశం అయ్యింది. సమావేశానికి హాజరుకావాలని సమాచారం ఇచ్చినా కూడా దయాకర్ రెడ్డి హాజరుకాకపోవటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలిగా.. ప్రస్తుత పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న నందమూరి సుహాసిని ఎంపిక చేస్తారనే.. ఈ ఆలోచన లో చంద్రబాబు ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయినా సరే.. సమావేశానికి ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న నందమూరి సుహాసిని దూరంగా ఉండటం వెనక ఉద్దేశం ఏంటీ అనేది హాట్ టాపిక్ అయ్యింది.

తెలంగాణలో పార్టీని మళ్లీ బతికించుకోవాలన్నా.. బలోపేతం చేయాలన్నా బలమైన చరిష్మా ఉన్న లీడర్ కావాలని క్యాడర్ అంతా అంటుంది. ఈ క్రమంలోనే నందమూరి సుహాసిని వైపు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఆమె ఆధ్వర్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పరిగించొచ్చు అని భావిస్తున్నారు కార్యకర్తలు. నందమూరి సుహాసిని తెలంగాణకు అధ్యక్షురాలు అయితే ఆటోమేటిక్ గా నందమూరి వంశం అభిమానులు, ఎన్టీఆర్, కళ్యాణ్ రాం, నారా కుటుంబం అభిమానులు అందరూ ఎంతో కొంత ప్రత్యక్ష, పరోక్ష మద్దతు లభిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం వస్తుందని అందరూ భావించారు.

అందుకు భిన్నంగా.. అనూహ్యంగా.. కొత్త అధ్యక్ష ఎన్నికపై జరిగిన భేటీకి నందమూరి సుహాసిని హాజరుకాకపోవటం, దూరంగా ఉండటం ఏంటనే చర్చ బలంగా వినిపిస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు