మోడీని ప్రశ్నించాల్సింది పోయి.. పొగడ్తలా.. సీఎం జగన్ పై చంద్రబాబు ఆగ్రహం.. బెయిల్ కోసమే అంటూ మండిపాటు

chandrababunaidu counters ap cm jagan

రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కరోనా కేసులు పెరిగిపోయాయి.. జనం పిట్టల్లా రాలుతుంటే.. దేశవ్యాప్తంగా కరోనాను గాలికొదిలేసి.. ఎన్నికలు పెట్టి ఇంత విధ్వంసానికి కారణం అయిన ప్రధానమంత్రి మోడీని.. ప్రపంచ దేశాలు అన్నీ తిట్టిపోస్తుంటే.. మన రాష్ట్ర సీఎం జగన్ మాత్రం పొగుడుతున్నారు.. ఇలాంటి విడ్డూరం ఎక్కడైనా ఉందా.. ఈయన కేసుల కోసం.. బెయిల్ కోసం రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడతాడా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.

ఎన్నికలు పెట్టకుండా అందరికీ వ్యాక్సిన్ వేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని.. ఇలాంటి పరిస్థితుల్లో విఫలమైన కేంద్ర ప్రభుత్వాన్ని.. ప్రధాని మోడీ నిరంకుశత్వాన్ని ప్రశ్నించకపోవటంతోపాటు.. చత్తీస్ ఘడ్ సీఎం సోరెన్ దైర్యంగా ప్రశ్నిస్తూ ముందుకు వస్తే.. ఈ జగన్ రెడ్డి.. ఆయన్ను విమర్శిస్తాడా.. ఇదెక్కడి చోద్యం అండీ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

కేసుల కోసం.. బెయిల్ కోసం మీ పార్టీని తాకట్టుపెట్టుకోండి కానీ.. రాష్ట్రాన్ని.. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టొద్దంటూ చంద్రబాబునాయుడు తన తరహాలో తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. జగన్ వైఖరి.. మోడీ వైఫల్యాలను ఎండగట్టాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులకు పిలుపునిచ్చారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు