పాస్టర్ పాడు పని.నాలుగో తరగతి బాలికపై అఘాయిత్యం

పాస్టర్ పాడు పని.నాలుగో తరగతి బాలికపై అఘాయిత్యం

పదేళ్ల పాపపై ఓ పాస్టర్ లైంగిక దాడి చేశాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జరిగింది. నగరంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి పక్కనున్న ఓ కాలానికి చెందిన తేళ్ల అపోలో స్థానికంగా చర్చి పాస్టర్.. దీనికి తోడు విద్యార్థులకు పాటలు కూడా చెబుతాడు.

prakashపాస్టర్ వృత్తిలో ఉంటూ తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ట్యూషన్ కు వచ్చే పదేళ్ల బాలికపై కన్నేసిన అపోలో పదిరోజుల క్రితం ఓ సారి మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెబితే దేవుడు శిక్షిస్తాడని బాలికను భయపెట్టాడు.

ఐదు రోజుల క్రితం స్వీట్లు ఇస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు. తోటి విద్యార్థులు చూసి బాలిక పిన్నికి తెలిపారు. దింతో ఆమె ఆదివారం దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పాస్టర్ అపోలోపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. కాగా పాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా బాధిత బాలికకు తల్లి దండ్రి ఇద్దరు లేరు.. ఆమె అమ్మమ దగ్గర ఉంటూ పాఠశాలకు వెళ్తుంది. అపోలో నిర్వహించే చర్చికి కూడా వెళ్తుంది బాలిక.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు