ఆరేళ్ల టీఆర్ఎస్ పాలన – అబద్దాలు, మోసాలపై ఛార్జిషీట్

సీవరేజ్ మాస్టర్ ప్లాన్ ద్వారా 10 వేల కోట్ల రూపాయలతో పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నా.. ఆరేళ్లుగా అస్సలు ఎందుకు

తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు, మోసాలపై ఛార్జిషీట్ విడుదల చేసింది బీజేపీ. ఆరేళ్లలో 60 అరాచకాలు, మోసాలు ఇవే అంటూ బుక్ లెట్ ను విడుదల చేశారు కేంద్ర మంత్రి జవదేకర్. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుతాం అని వివరించారు.

టీఆర్ఎస్ అబద్దాలు, మోసాలు ఏంటో చూద్దాం…

1. ఆరేళ్లలో 67 వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ కు ఖర్చు చేస్తే.. ఏ డివిజన్ కు ఎంత ఇచ్చారు.. అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేశారు. వర్షాలు వస్తే ఎందుకు మునుగుతున్నాయి. ఈ 67 వేల కోట్లను దేనికి ఎంత ఖర్చు చేశాం అనేది ఎందుకు చెప్పటం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం.
2. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తాం అని ఆరేళ్ల క్రితం చెప్పారు.. ఇప్పటి వరకు కేవలం 11 వందలు మాత్రమే పూర్తి చేసి గృహప్రవేశాలు చేశారు. లక్ష ఎక్కడ – 11 వందలు ఎక్కడ.. నిధులు ఏమయ్యాయి.. ఇళ్లు ఎక్కడుతున్నాయి. ఖర్చు చేసిన నిధులు ఎటు వెళ్లాయి.
3. 100 రోజుల్లోనే నగరం రూపురేఖలు మార్చుతాం అని 2016లో పదే పదే చెప్పారు. ఐదేళ్లలో ఏం మార్చారు.. ఏం మార్పు చెందింది. వంద రోజుల ప్రణాళిక ఎక్కడ ఉంది?

4. 2014లో, 2016లో మూసీ రివర్ ఫ్రెండ్ హామీ అని 1,400 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దీని కోసం గుజరాత్ సబర్మతి వెళ్లి వచ్చారు. ఆ డబ్బులు ఏమయ్యాయి.. బ్యూటిఫికేషన్ ఎక్కడికి పోయింది.
5. 2016లో కూకట్ పల్లి నిజాంపేట బండారీ లేఅవుట్ లో వరదల్లో మునిగింది. డ్రైనేజీలు విస్తరిస్తాం అని.. కొత్త డ్రైనేజీలను 11 వేల కోట్లతో.. మూడేళ్లలో పూర్తి చేస్తాం అని ప్రకటించారు. ఇప్పటి వరకు ఏం మార్పు తీసుకొచ్చారు. మొన్న వచ్చిన వరదలకు కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా.
6. ఇటీవల హైదరాబాద్ వరదల్లో సర్వశ్వం కోల్పోయారు ప్రజలు. 10 వేల ఆర్థిక సాయం పేరుతో పంపిణీ చేసిన నిధుల్లోనూ 650 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నేతలు పంచుకున్నది నిజం కాదా. నెల రోజులకు కూడా వరద బాధితులను అంచనా వేయటంలో విఫలం చెందినది నిజం కాదా.

7. 2016లో ఆస్తి పన్ను సబ్సిడీ అంటూ 1200 రూపాయలు చెల్లించే వారు 101 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని.. 5 లక్షల మందికి లబ్ధి అని చెప్పారు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మర్చిపోయారు. ఆస్తి పన్ను రెట్టింపు చేశారు. నిజం కాదా
8. హుస్సేన్ సాగర్ ను కొబ్బరినీళ్లుగా చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆరేళ్లలో ఎందుకు పట్టించుకోలేదు. కనీసం చెత్త అయినా తీశారా.
9. మెట్రో రైలు ఇప్పటి వరకు ఓల్డ్ సిటీకి ఎందుకు వెళ్లలేదు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు లైవ్ వేస్తామని చెప్పి నాలుగేళ్లుగా ఎందుకు పనులు మొదలుపెట్టలేదు.

10. హుస్సేన్ సాగర్ చుట్టూ 60 నుంచి 100 అంతస్తులతో సాగర్ టవర్స్ నిర్మిస్తామని 2014, 2016 ఎన్నికల్లో చెప్పారు.. టవర్ల నిర్మాణం ఎంత వరకు వచ్చింది?
11. హైదరాబాద్ సిటీలో హెరిటేజ్ బిల్డింగ్స్ కూల్చివేస్తున్నారు. సెక్రటేరియట్, ఉస్మానియా ఆస్పత్రి, అసెంబ్లీ, ఎర్రమంజిల్ ప్యాలెస్ ఇలా అన్నింటినీ కూల్చివేతతోపాటు ప్రణాళిక ఎందుకు చేస్తున్నట్లు.
12. ఒక్క రూపాయికే… 32 వేల నల్లా కనెక్షన్స్ అని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారు..
13. సిటీ శివార్లలో రాచకొండ, శామీర్ పేటలో భారీ రిజర్వాయర్లు కట్టి సిటీకి గోదావరి, కృష్ణా నీళ్లు 24 గంటలూ ఇస్తాం అని చెప్పి ఇప్పటి వరకు రాయి కూడా ఎందుకు వేయలేకపోయారు.
14. జీహెచ్ఎంసీలో 18 వేల మంది కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేసింది నిజం కాదా

15. డల్లాస్, ఇస్తాంబుల్ ఇలాగే ఉంటాయి.. ఆరేళ్లలో అందుకు తగినట్లు ఒక్క పని అయినా చేశారా.. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్ధాలు,మోసపు మాటలు కాదా.
16. జీహెచ్ఎంసీకి కేంద్రం ఇచ్చిన నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వకుండా.. సిటీ అభివృద్ధిని కాలికొదిలేసింది నిజం కాదా. జీహెచ్ఎంసీ పేరుతో భారీ అప్పులు తెస్తూ.. ప్రజలపై పన్నుల భారం మోపుతున్నది.
17. కార్పొరేటర్ డెవలప్ మెంట్ ఫండ్ కింద 450 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నా.. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా డివిజన్లలో అభివృద్ధి చేయకుండా నాశనం చేసిన మాట వాస్తవం కాదా. భారీ వర్షాలు, వరదల నుంచి రక్షణ కోసం సీవరేజ్ మాస్టర్ ప్లాన్ ద్వారా 10 వేల కోట్ల రూపాయలతో పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నా.. ఆరేళ్లుగా అస్సలు ఎందుకు పట్టించుకోలేదు.
18. సిటీ వ్యాప్తంగా 130 కోట్లతో 40 మోడల్ మార్కెట్లు, 200 ఆదర్శ మార్కెట్లు నిర్మిస్తాం అని చెప్పారు.. ఎక్కడైనా తెచ్చారా.. ఉంటే చూపించాలి

19. స్వచ్ఛ భారత్ లో భాగంగా 15 కొత్త డంపింగ్ యార్డులు తీసుకొస్తామన్నారు.. ఒక్కటైనా తీసుకొచ్చారా. 36 కొత్త స్మశాన వాటికి సంగతి ఏమైందీ.. కొత్త పార్కుల నిర్మాణం ఎటుపోయింది. లైబ్రరీ సెస్సు వసూలు చేస్తూ.. ఒక్క లైబ్రరీ అయినా కొత్తగా పెట్టారా..
20. ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయకపోవటం వల్ల ఆగిపోయిన విషయం నిజం కాదా
21. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల నిర్వహణ కోసం సిటీకి నలువైపులా 4 పెద్ద ఆడిటోరియాలు నిర్మిస్తాం అన్నారు.. ఎక్కడికి పోయాయి అవి.. రవీంధ్రభారతిని ఆధునీకరిస్తాం అని చెప్పి ఒక్క పైసా అయినా విడుదల చేశారా.

22. సిటీలో 25 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఎక్కడికి పోయింది. హైటెక్స్ దగ్గర మాత్రమే ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ ఎందుకు వాడుకలోకి తీసుకురాలేదు.
23. సిటీ అంతా ఫ్రీ వైఫై అన్నారు.. నక్సెస్ రోడ్ లో మాత్రమే తెచ్చినా పని చేయటం లేదు.. ఎందుకిలా జరిగింది.

ఈ ఛార్జిషీట్ బీజేపీకి ఎన్ని ఓట్లు రాలుస్తుందో చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు