ఏపీలో థర్డ్ వేవ్ వచ్చేసిందా.. ఈ పిల్లల కరోనా లెక్కలు దేనికి సంకేతం..

ఏపీలో థర్డ్ వేవ్ వచ్చేసిందా.. ఈ పిల్లల కరోనా లెక్కలు దేనికి సంకేతం..

ఏపీలో థర్డ్ వేవ్ వచ్చేసిందా.. ఈ పిల్లల లెక్కలు దేనికి సంకేతం.. ఆందోళనలో ప్రజలు

ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్న మాట ఎంత వాస్తవమో.. అంతకు మించి భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేస్తున్న లెక్కల్లోనే ఈ విషయం బయటపడింది. కరోనా థర్డ్ వేవ్ పిల్లలకు ఎటాక్ అవుతుందని నిపుణులతోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ సైతం హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వారాల్లో అంటే.. మే 18 నుంచి మే 31వ తేదీ వరకు లెక్కలను పరిశీలిస్తే.. రెండు లక్షల 30 వేల కేసులు నమోదయ్యాయి.

వీటిలో 23 వేల 920 పాజిటివ్ కేసులు.. పిల్లలు, 18 ఏళ్ల లోపు వారు ఎఫెక్టెడ్ అయ్యారు. ఇందులోనూ 2 వేల 209 మంది చిన్నారులు ఐదేళ్ల లోపు వారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 4 వేల 200 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. 3 వేల 800 మంది చిన్నారులతో చిత్తూరు జిల్లా రెండో స్థానంలో ఉంది.

6 నుంచి 18 ఏళ్ల మధ్య వారు 21 వేల 711 మంది కరోనా బారిన పడటం వైద్య శాఖను ఆందోళనకు గురి చేస్తుంది.

ఈ అంశంపై డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మొదటి వేవ్ లో పెద్దోళ్లు.. సెకండ్ వేవ్ లో యువత.. మూడో వేవ్ లో చిన్నారులపై కరోనా ప్రభావం చూపిస్తుందన్నారు. వైరస్ మ్యూటేషన్ కావటం వల్లే పిల్లలకు ఎటాక్ అవుతుందని వివరించారు. దీన్ని థర్డ్ వేవ్ అనొచ్చో.. లేదో కూడా తెలియటం లేదని.. ట్రీట్ మెంట్ చాలా ముఖ్యం అన్నారు. పిల్లల ఆరోగ్య భద్రత విషయంపై పేరంట్స్, ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు