మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అందరూ హోం క్వారంటైన్ – కుటుంబ సభ్యులు, పనివాళ్లకు కూడా కరోనా టెస్టులు

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అందరూ హోం క్వారంటైన్ – కుటుంబ సభ్యులు, పనివాళ్లకు కూడా కరోనా టెస్టులు

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే లక్షణాలు లేవని స్వయంగా ప్రకటించారు. నాలుగు, ఐదు రోజులుగా ఆయనతో కలిసి వారు అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరారు. దీంతో చిరంజీవి ఇంట్లో ఉన్న వారు అంటూ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. అందరూ హోం క్వారంటైన్ అయ్యారు. ఇంట్లో పని వాళ్లకు కూడా పరీక్షలు చేస్తున్నారు.
నాలుగు రోజుల క్రితమే చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి చెఫ్ అవతారంలో చికెన్ వండారు. దీంతో పిల్లలకు కూడా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు.

చిరంజీవి ఇంట్లోనే అతని తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు ఉంటున్నారు.
వాళ్లు అందరూ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. పరీక్షలు రావాల్సి ఉంది
చిరంజీవి ఓ గదిలో హోం క్వారంటైన్ అయ్యారు. మిగతా వాళ్లకు దూరంగా ఉంటున్నారు.
చిరంజీవికి కరోనా పాజిటివ్ వార్త సినీ ఇండస్ట్రీలో సంచలనం అయ్యింది. బ్రేకింగ్ న్యూస్ అయ్యింది.
రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్ తో భేటీ కావటంతో.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు