గురువు విశ్వనాథ్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్న చిరంజీవి

శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి వంటి క్లాసికల్ చిత్రాల్లో

దీపావళి పండుగ సందర్భంగా.. గురువు, ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్లి.. ఆయన్ను శుభాకాంక్షలు చెప్పి.. ఆశీస్సులు తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. శనివారం ఉదయం భార్య సురేఖతో కలిసి హైదరాబాద్ లోని ఆయన ఇంటికెళ్లి కలిశారు. ఇద్దరు తమ పాత, మధుర జ్ఞాపకాలను, సినిమా విశేషాలను చర్చించుకున్నారు.

విశ్వనాథ్ గారి ఆరోగ్య, క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు వారి కుటుంబంతో కలిసి కాలక్షేపం చేశారు.

విశ్వ‌నాథ్ గారిని క‌ల‌వాల‌నిపించి ఆయ‌న ఇంటికి రావ‌డం జ‌రిగిందని.. నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీసిన ఆయనను.. దీపావ‌ళి రోజున క‌ల‌వ‌డం సంతోషంగా ఉందన్నారు చిరంజీవి.

విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి వంటి క్లాసికల్ చిత్రాల్లో నటించిన.. అవార్డులు దక్కించుకున్నారు మెగాస్టార్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు