బైరెడ్డిగా రానున్న మెగాస్టార్ చిరంజీవి

chiranjeevi baireddy movie

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మళయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మళయాళ లూసిఫర్ లో మోహన్ లాల్ చేసిన పాత్రను మెగాస్టార్ చేస్తుండగా, మంజూవారియర్ చేసిన పాత్రలో నయనతార కనిపించబోతుంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులను అనుగుణంగా పుర్తిగా మార్పులు చేశారు డైరెక్టర్ జయం మోహన్ రాజా. ఇక ఈ చిత్రాన్ని స్వయంగా సురేఖ కొణిదెల సమర్పణలో నిర్మాణం జరుగుతుంది.

సినిమా టైటిల్ ఇదే – బైరెడ్డిగా రానున్న మెగస్టార్ చిరంజీవి

మళయళంలో లూసిఫర్ గా వచ్చిన ఈ చిత్రాన్నికి తెలుగులో బైరెడ్డి అనే పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. చిరంజీవి సైతం గత సినిమాల దృష్టా ఇదే టైటిల్ కు మొగ్గు చూపుతున్న సిని వర్గాలు అంటున్నాయి. బైరెడ్డి అనే టైటిల్ అయితే నే మాస్ ఆడియన్స్ కు సైతం కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని దర్శకనిర్మాతలు సైతం భావిస్తున్నారు.

జనవరి 21 2021 న పూజాకార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఏప్రిల్ నాటికి పూర్తి కావాల్సిన మొదటి షెడ్యూల్ సైతం ఇంకా పూర్తికాలేదని చిత్ర బృందం వెల్లడించింది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు