రాజకీయంగా ఒకే పార్టీ అయినా.. ఇండస్ట్రీ పరంగా విజయం ఎవరిది.. మెగా వర్సెస్ మంచు

రాజకీయంగా ఒకే పార్టీ అయినా.. ఇండస్ట్రీ పరంగా విజయం ఎవరిది.. మెగా వర్సెస్ మంచు

రాజకీయంగా ఒకే పార్టీ అయినా.. ఇండస్ట్రీ పరంగా విజయం ఎవరిది.. మెగా వర్సెస్ మంచు

ఒక్క దెబ్బకు అన్ని పిట్టలు ఎగిరిపోతున్నాయి.. తుపాకీ పేల్చిన చిరంజీవి.. బుల్లెట్ దింపకుండానే సినీ ఇండస్ట్రీపై మరోసారి పైచేయి సాధిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. మా ఎన్నికల్లో తెర వెనకే ఉండి.. ప్రకాష్ రాజ్ రూపంలో తన ప్యానెల్ విజయానికి రాచబాట వేశారు. దీని వెనక అతిపెద్ద రాజకీయ వ్యూహం ఉండటం.. ముందు నుంచే అన్నీ చక్కబెట్టుకోవటం చూస్తుంటే.. బాస్ రీ ఎంట్రీ తర్వాత తన పెద్దరికాన్ని ఇండస్ట్రీలో పదిలం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మెగా ఫ్యామిలీ పెద్దాయన చిరంజీవి మద్దతు ఉన్నట్లు స్పష్టం అయిపోయింది. నాగబాబు రూపంలో అది ఇప్పటికే క్లారిటీ వచ్చినా.. మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే శ్రీకాంత్, ఉత్తేజ్ లాంటి వాళ్లు ఉండటంతో.. మెగా సపోర్ట్ దానికే అని క్లారిటీ అయిపోయింది.

ప్రకాష్ రాజ్ కు పోటీగా మంచు ఫ్యామిలీ నుంచి హీరో మంచు విష్ణు రంగంలోకి దిగుతున్నాడు. త్వరలోనే ప్యానెల్ సభ్యుల ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. మంచు ఫ్యామిలీ సభ్యుడు.. మోహన్ బాబు కుమారుడే స్వయంగా బరిలోకి దిగుతుండటంతో.. మా ఎన్నికల ప్రక్రియ.. రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరుగా మారిపోయింది.

సినీ ఇండస్ట్రీ పెద్దరికం విషయంలో ఇప్పటికే అంతర్గతంగా ఉన్న ఈ కుటుంబాల మధ్య పోటీ.. మా ఎన్నికలతో బహిర్గతం అయినట్లే అంటున్నారు సినీ ఇండస్ట్రీ వ్యక్తులు.

సినీ ఇండస్ట్రీతో రాజకీయాలను వేరు చేసి చూడలేం. ఇలాంటి సమయంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు టీఆర్ఎస్ పార్టీలతో చిరంజీవి, మోహన్ బాబు ఫ్యామిలీలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ రెగ్యులర్ గా ఇద్దరు సీఎంలతో టచ్ లో ఉంటూ వస్తున్నారు. ఇద్దరినీ కాదనలేని పరిస్థితి రెండు ప్రభుత్వ పెద్దలది. ఇటీవలే ఏపీ ప్రభుత్వ పాలనపై చిరంజీవి తరచూ పొగడ్తలు కురిపిస్తున్నారు. మరోవైపు మంచు ఫ్యామిలీకి సీఎం జగన్ కుటుంబంతో బంధుత్వం ఉంది. ఈ రెండు అంశాలతో.. ఇద్దరూ ఎక్కడా తగ్గటం లేదు.

ప్రభుత్వ పరంగా ఉన్న మద్దతుతోపాటు.. సినీ ఇండస్ట్రీలో పెద్దరికం అనేది ఎంతో ముఖ్యం. దాసరి నారాయణరావు ప్లేస్ ను భర్తీ చేసే విషయంలో చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ పోటీగానే ఉన్నా.. ఏ ఒక్కరికీ ఏకగ్రీవంగా అంగీకరించే పరిస్థితి లేదు. ఇలాంటి టైంలో.. మంచు విష్ణు మా ఎన్నికల్లో గెలిస్తే.. సినీ ఇండస్ట్రీపై మోహన్ బాబు ఆధిపత్యం వచ్చినట్లే అంటున్నారు.

మెగా ఫ్యామిలీకి ఉన్న మద్దతు తక్కువైంది ఏమీ కాదు. నేటి తరం వాళ్లు అంతా మెగా ఫ్యామిలీ వెంటే ఉన్నారని చెబుతున్నారు సినీ పెద్దలు. మంచు ఫ్యామిలీ నేరుగా రంగంలోకి దిగుతుంటే.. చిరంజీవి మాత్రం తెర వెనక తన పవర్ చూపించబోతున్నారు. విజయం ఎవరిదైనా.. తెర వెనక ఈక్వేషన్స్ మారే సిట్యువేషన్ మాత్రం గ్యారెంటీ అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు