కుక్కను చంపి బతికించా – తల్లిదండ్రులను నమ్మించిన అలేఖ్య

chittore district madanapalli family case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లి హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల అదుపులో ఉన్న పద్మజ, పురుషోత్తమ్ ల వాగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు.

కుక్కను చంపి బతికించా – చెల్లిని, మిమ్మల్ని బతికిస్తా : తల్లిదండ్రులను నమ్మించిన అలేఖ్య

పెద్దకూతురు అలేఖ్య కొన్ని రోజులుగా ఒకవిధమైన ట్రాన్స్ లో ఉన్నట్టు తేల్చారు. తాను శివ శక్తినని అలేఖ్య తల్లిదండ్రులిద్దరిని నమ్మించింది. పునర్జన్మ అనేది మళ్లీ ఉంటుందని, చనిపోయిన వారిని బతికించే శక్తి తనకు ఉందని, ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను సైతం చంపి బతికించానని అలేఖ్య నమ్మబలికింది. పెద్దకూతురు మాటలు విని ట్రాన్స్ లోకి వెళ్ళిన పద్మజ , పురుషోత్తమ్ లు మొదట తమ చిన్నకూతురు శ్రీదివ్యను చంపేశారు. అనంతరం అలేఖ్యను సైతం హత్య చేశారు. తాము శివశక్తులం కాబట్టి మళ్లీ బతుకుతాం అనే మూఢనమ్మకంతో వీరు ఇలా చేసినట్టు పోలీసులు తేల్చారు.

ఎంతో ఉన్నత విద్యావంతులైన వీరి కుటుంబం ఈ రకమైన సైకిక్ ట్రాన్స్ లోకి వెళ్లడానికి కారణం ఏంటి? ఎవరైనా ఈ విధంగా చేయాలని వీరిని ప్రేరిపించారా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక తీవ్రమైన సైకిక్ ట్రాన్స్ లో ఉన్న పద్మజ , పురుషోత్తమ్ లను మదనపల్లి నుండి తిరుపతిలోని రుయా హాస్పటల్ కు తరలించనున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు