హైకోర్టు తీర్పుతో టీడీపీ అత్యవసర సమావేశం – ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు చర్చలు

హైకోర్టు తీర్పుతో టీడీపీ అత్యవసర సమావేశం - ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు చర్చలు

బద్వేల్ ఉప ఎన్నికకు దూరంగా ఉందామా ?నాయకులకు చంద్రబాబు సంకేతాలు ?

హైకోర్టు తీర్పుతో టీడీపీ అత్యవసర సమావేశం – ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు చర్చలు

ఏప్రిల్ 8వ తేదీ జెడ్పీ ఎన్నికల పోలింగ్ పై స్టే విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తెలుగుదేశం పార్టీ అత్యవసరంగా భేటీ అయ్యింది. అందుబాటులోని సీనియర్ నేతలతో చంద్రబాబు మీటింగ్ పెట్టారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించటంపై చర్చించారు.

వాస్తవంగా అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అప్పట్లో ఏడు రోజుల సమయం మాత్రమే ఉంది.. ఏప్రిల్ 6వ తేదీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ద్వారా ఏప్రిల్ 15వ తేదీ వరకు సమయం వచ్చింది. మరి ఇంత సమయం ఉంది కనుక.. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది.. హైకోర్టులో పార్టీ వాదనలకు బలం చేకూరింది.. ఇదే విషయాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి ప్రభుత్వ మొండి వైఖరిని తెలియజేస్తూ వారిలో చైతన్యం తీసుకువస్తే ఎలా ఉంటుంది అని పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు.

ఎన్నికలను బహిష్కరించినా పోటీలో పార్టీ అభ్యర్థులు ఉన్నారు.. పార్టీ గుర్తుపైనే పోలింగ్ జరుగుతుంది. చాలా చోట్ల ఆయా జిల్లా నేతలు, అభ్యర్థులు వ్యక్తిగత ప్రతిష్టతో బరిలోకి దిగి పోరాడుతున్నారు. అలాంటి వారి కోసం కాకపోయినా.. కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని చర్చించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారంట సీనియర్స్. ఇప్పటికే బహిష్కరణను అధికారికంగా ప్రకటించాం.. మళ్లీ పోటీలో ఉన్నాం అంటే కన్ఫ్యూజ్ చేసినట్లు ఉంటుందని కొంత మంది నేతలు అభిప్రాయపడ్డారంట.

దీనిపై చంద్రబాబు ఫైనల్ డెసిషన్ తీసుకోకపోయినా.. జెడ్పీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుతో.. ఎన్నికల్లో పోటీపై చంద్రబాబు ఓ ఆలోచన అయితే చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు