చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. అమరావతి అసైన్డ్ భూములు అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రెండు సీఐడీ బృందాలు ఈ రోజు ఉదయం మాజీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చాయి. కాగా ఈ అసైన్డ్ భూముల వ్యవహారంపై నాలుగు రోజుల క్రితం చంద్రబాబుతోపాటు మరికొందరు నేతలపై కేసు నమోదైంది.

ఇక మంగళవారం 41 సీఆర్పీసి కింద చంద్రబాబుకు నోటీసులు అందించారు అధికారులు. ఇక దీనిపై టీడీపీ నేతలు స్పందించారు. ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టప్రకారమే భూముల అమ్మకం కొనుగోళ్లు జరిగినట్లు వివరించారు. ఇక ఈ భూముల వ్యవహారంలో త్వరలో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. చంద్రబాబుకు నోటీసులు పంపడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే మాజీ మంత్రిలు నారాయణ, పత్తిపాటి పుల్లారావుకు కూడా నోటీసులు ఇచ్చారు అధికారులు.

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు