త్వరలో తెలంగాణలో ధియేటర్లు.. మాల్స్ మూసివేత

త్వరలో తెలంగాణలో ధియేటర్లు.. మాల్స్ మూసివేత ముందు జాగ్రత్తగా పాఠశాలలను మూసివేసింది ప్రభుత్వం. ఇలాంటి సమయంలో థియేటర్లు, మాల్స్ ను కొనసాగించి..

cinema-halls-and-malls-close-due-to-corona-second-wave-in-telangana

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వచ్చిన క్రమంలో.. పాఠశాలలు, కాలేజీలు మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసకుంది. ఈ క్రమంలోనే.. సినిమా ధియేటర్లు, మాల్స్ కూడా తాత్కాలికంగా కొన్ని రోజులు మూసి వేయాలనే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే పిల్లలకు సెలవులు ప్రకటించిన క్రమంలో.. వినోదం కోసం భారీ ఎత్తున ధియేటర్లు, మాల్స్ కు వచ్చే అవకాశం ఉన్న క్రనమంలో.. వాటిని కూడా మూసివేయాలని ఆలోచన గట్టిగా చేస్తుంది ప్రభుత్వం.

అన్ లాక్ తర్వాత రెండు నెలల క్రితమే ధియేటర్లు, మాల్స్ రీ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే ధియేటర్లకు వస్తున్నారు ప్రజలు. ఇలాంటి సమయంలోనే కరోనా మళ్లీ విజృంభిస్తుండటం.. మార్చి 22వ తేదీన హైదరాబాద్ లోనే 350కి పైగా కరోనా కేసులు నమోదు కావటం.. ఆరుగురు చనిపోవటంతో.. స్కూల్స్, కాలేజీలు, గురుకులాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో.. ముందు జాగ్రత్తగా పాఠశాలలను మూసివేసింది ప్రభుత్వం.

ఇలాంటి సమయంలో థియేటర్లు, మాల్స్ ను కొనసాగించి.. మరింత ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకని భావిస్తున్న ప్రభుత్వం.. కనీసం రెండు వారాలపాటు వాటిని సైతం మూసివేసి కరోనాను కంట్రోల్ చేయటానికి సన్నాహాలు చేస్తుంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రానుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు