ఆగస్ట్ వరకు సినిమా ధియేటర్లు ఓపెన్ కావు.. తొందరెందుకు అంటూ అక్షింతలు

ఆగస్ట్ వరకు సినిమా ధియేటర్లు ఓపెన్ కావు.. తొందరెందుకు అంటూ అక్షింతలు

cinema theatres closed till august 2021
cinema theatres closed till august 2021

దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రోజువారీగా 4 లక్షల నుంచి లక్షా 80 వేలకు వచ్చింది.. ఇదే సమయంలో రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతోపాటు.. మరణాల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. పాజిటివ్ కేసులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ప్రభుత్వాలు.. ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా క్రమంగా లాక్ డౌన్ సడలింపులు చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే సినిమా ధియేటర్లను ఓపెన్ చేయాలనే డిమాండ్ వచ్చింది. సింగిల్ ధియేటర్లలో రెండు షోలు వేసుకుంటాం.. సీటుకు సీటు మధ్య గ్యాప్ ఇస్తాం అంటూ ప్రపోజల్ పెట్టింది దేశంలోని సినీ ఇండస్ట్రీ. కోట్లాది మంది ఉపాధిపై ఏడాది కాలంగా ప్రభావం చూపుతుందని.. అందుకు అనుగుణంగా కొన్ని ఆంక్షలతో పర్మీషన్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తుంది.

దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖతోపాటు శాస్త్రవేత్తలు ససేమిరా అని తేల్చి చెప్పారు. పాజిటివ్ రేటు బాగా తగ్గుతున్నాయని.. ధియేటర్లకు పర్మీషన్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు. మరో మూడు నెలలు అంటే.. జూన్, జూలై, ఆగస్ట్ నెలల వరకు ధియేటర్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మూడు నెలలు సినిమా విడుదల చేసుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించింది కేంద్రం.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా.. పరిస్థితులు చక్కబడలేదని.. ఇంకా ఆందోళనకరంగానే ఉందని స్పష్టం చేసింది కేంద్రం. ఇప్పట్లో ధియేటర్లు ఓపెన్ చేస్తారనే ఆలోచనలో ఉండొద్దని.. సినిమా షూటింగ్స్ అనేవి జాగ్రత్తలు తీసుకుని చేసుకోవాలని స్పష్టం చేసింది.

సో.. మొత్తానికి సినిమా ధియేటర్లు ఆగస్ట్ వరకు తెరుచుకోవటం కష్టమని తేలిపోయింది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు