సిటీ బ్యాంక్ మూసివేత – బ్రాంచులు అన్నీ ఎత్తివేత : పురాతన ఫారిన్ బ్యాంక్ చరిత్ర క్లోజ్

సిటీ బ్యాంక్ మూసివేత - బ్రాంచులు అన్నీ ఎత్తివేత : పురాతన ఫారిన్ బ్యాంక్ చరిత్ర క్లోజ్

సిటీ బ్యాంక్.. విదేశాలకు చెందిన ఈ బ్యాంక్.. ఇండియాలో పురాతన ఫారిన్ బ్యాంక్ గా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా అనేక బ్రాంచులతో రిటైల్ బ్యాంకింగ్ వ్యవహారాలను నిర్వహిస్తుంది. అలాంటి సిటీ బ్యాంక్ ఇప్పుడు మూతపడనుంది. ఇండియాలో రిటైల్ బ్యాంక్ కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. దశల వారీగా 2021 చివరి నాటికి బ్యాంకు బ్రాంచులు ఎత్తివేయనుంది.

సిటీ బ్యాంక్ ఇండియాతోపాటు.. మరో 12 దేశాల్లోనూ తమ రిటైన్ బ్యాంక్ కార్యకలాపాలను మూసివేస్తున్న సంచలన ప్రకటన చేసింది. దీని కారణం.. దేశీయంగా ఉన్న sbi, icici, hdfc వంటి బ్యాంకులతో పోటీ పడకపోవటమే. రిటైల్ బ్యాంకింగ్ వల్ల నష్టాలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సిటీ బ్యాంక్ దగ్గర ఒక లక్షా 57 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి.

రిటైల్ బ్యాంకింగ్ మూసివేసినా.. క్రెడిట్ కార్డు, తాకట్టు వ్యాపారం, హెల్త్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఇండియాలో సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులు కోట్లలో ఉన్నారని.. క్రిడిట్ కార్డు బిజినెస్ మంచి లాభాల్లో ఉందని.. దాన్ని కొనసాగిస్తామని భరోసా ఇచ్చింది.

2 వేల సంవత్సరంలో ఇండియాలో సిటీ బ్యాంక్ విస్తరణ వేగంగా సాగింది.. 2008 ఆర్థిక సంక్షోభం కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్నది ఈ బ్యాంక్. ఆ తర్వాత 2012 నుంచి పుంజుకుని రిటైల్, క్రెడిట్ కార్డు, తాకట్టు వ్యాపారాల్లో మంచి లాభాల్లో కొనసాగుతుంది. వీటిని కొనసాగిస్తూ.. రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలను మూసివేస్తూ.. ఇండియాలో తన చరిత్రకు కొత్త రూపు ఇవ్వాలని భావిస్తుంది సిటీ బ్యాంక్..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు