మంత్రి ఈటలపై వేటుకు వేసేందుకు రంగం సిద్దం.. పొమ్మనలేక భూ కబ్జా పొగ పెట్టారా : మీడియా ముందస్తు ప్లాన్

minister etela rajender

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ ను కేబినెట్ నుంచి.. మంత్రి పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం అయిపోయింది. ఉరుము మెరుపు లేకుండా ఏప్రిల్ 30వ తేదీ గురువారం సాయంత్రం నుంచి.. ఓ వర్గం మీడియాలో ఆరోగ్య మంత్రి ఆక్రమణల దందా అంటూ స్టోరీలు రావటం వెనక వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే ఎలా వచ్చింది అనేది ఓ పాయింట్ అయితే.. ఇందులో కులాన్ని తీసుకురావటంతోనే టార్గెట్ ఎంటో స్పష్టం అయ్యింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, బడుగులకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని బలవంతంగా లాక్కున్నారని.. మంత్రి ఈటెల రాజేందర్ తన భార్య, కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారనేది మీడియా ఆరోపణలు.

మెదక్ జిల్లాలోని అచ్చంపేట, మూశాయిపేట మండలాల పరిధిలోని సర్వే నెంబర్లలోని భూమిని మంత్రి ఈటెల కబ్జా చేశారంటూ చెబుతున్నారు. మీడియా మంత్రి ఈటెల భూ కబ్జా అలా బ్రేకింగ్ వచ్చిందో లేదో.. ఆయా గ్రామాల్లో మీడియా లైవ్ వ్యాన్స్ చేరుకున్నాయి. వెంటనే భూముల దగ్గర నుంచి.. బాధితుల నుంచి లైవ్ ఇచ్చారు. అంటే పక్కా ప్లాన్ అని అర్థం అయిపోతుంది.

హైదరాబాద్ నుంచి ఆయా గ్రామాలకు వెళ్లటానికి కనీసం రెండు గంటలు అయినా పడుతుంది.. అలాంటిది బ్రేకింగ్ వేసిన 15 నిమిషాల్లోనే లైవ్ వచ్చింది అంటే.. పక్కా ప్లాన్ అంటున్నారు జనం. ఓ వర్గం మీడియాలోనే మంత్రి ఈటెల భూ కబ్జా బాగోతాలు అంటూ లైవ్ డిబేట్స్ రావటం వెనక.. ప్రభుత్వంలోని కొంత మంది ప్రమేయం ఉందని స్పష్టంగా తేలిపోయింది.

కొంతకాలంగా తెలంగాణలోని రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఇదే సమయంలో భూ కబ్జా ఆరోపణలు రావటం చూస్తుంటే.. మంత్రిపై వేటుకు రంగం సిద్ధం చేయటంతోపాటు.. పొమ్మనలేక ఈ అబాండాలు వేస్తున్నారని తెలంగాణ వాదులు అంటున్నారు.

తెలంగాణ సమాజం చాలా తెలివిగలది.. రాజకీయ చైతన్యం కలది అంటారు.. ఆ సమాజం ఇప్పుడు మంత్రి ఈటెల వెనక ఉంటుందా లేదా అనేది చూడాలి.

See also : వైఎస్ అన్నప్పుడు కూడా బాధపడలేదు.. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావటం లేదు : ఈటెల కన్నీటి పర్యంతం

See also : మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా.. రూ. 100 కోట్ల భూమి అంట.. ఆ ఒక్క టీవీలోనే బ్రేకింగ్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు