తిరుపతి ప్రచారం మీరే చూసుకోండి – తేడా రావొద్దన్న సీఎం జగన్

తిరుపతి ప్రచారం మీరే చూసుకోండి - తేడా రావొద్దన్న సీఎం జగన్ ఏ రోజుకు ఆ రోజు సాయంత్రం పూట ఇవాళ జరిగిన ప్రచారం తీరు.. రేపటి షెడ్యూల్ అనే దానిపై అందరూ చర్చించుకోవాలని.. స్థానిక కార్యకర్తలు.. అభిమానుల అభిప్రాయాలు,..

cm jagan not campaign in tirupati lok sabha bypoll
cm jagan not campaign in tirupati lok sabha bypoll

పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి ప్రచారం చేయని సీఎం జగన్.. ఇప్పుడు అదే బాటలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారానికి సైతం వెళ్లటం లేదు. ప్రచార బాధ్యతలను నెల్లూరు, చిత్తూరు జిల్లా మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ఇంచార్జి మంత్రులకు అప్పగించారు.

ప్రచార వ్యూహంతోపాటు.. అందుకు కావాల్సిన రూట్ మ్యాప్ ను వివరించారు. ఎక్కడా తేడా రావొద్దు.. మెజార్టీ తగ్గొద్దు అని స్ట్రాంగ్ విజన్ వివరించారు. ఎలాగైనా గెలుస్తాం కదా అనే అశ్రద్ధ, నిర్లక్ష్యం వద్దని.. గెలుపు ముఖ్యం కాదు.. మెజార్టీ అనేది చాలా కీలకం అని స్పష్టం చేశారు.

ఏ చిన్న అంశాన్ని విస్మరించొద్దు.. ఎక్కడా అతి విశ్వాసం ప్రదర్శించొద్దు.. అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగిపోవాలి.. నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలి అని తేల్చిచెప్పారు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి నేను రావటం లేదు.. అన్ని బాధ్యతలు మీపైనే ఉన్నాయి.. మీపైనే గెలుపు మెజార్టీ బాధ్యత పెట్టాను అని వివరించారంట సీఎం జగన్. ఏ రోజుకు ఆ రోజు సాయంత్రం పూట ఇవాళ జరిగిన ప్రచారం తీరు.. రేపటి షెడ్యూల్ అనే దానిపై అందరూ చర్చించుకోవాలని.. స్థానిక కార్యకర్తలు.. అభిమానుల అభిప్రాయాలు, సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా తర్వాత రోజు ప్రచారంలోకి దిగాలని హితబోధ చేశారు సీఎం జగన్.

పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా అయితే పార్టీని గెలిపించారో.. అదే స్థాయిలో.. గత ఎన్నికల్లో మెజార్టీ తగ్గకుండా చూడాలన్నారు. ఓటింగ్ శాతం తగ్గినా.. పెరిగినా తమ మెజార్టీ గతం కంటే ఎక్కువగా ఉండాలి అని ఖరాఖండిగా చెప్పటంతోపాటు.. అందరికీ అన్ని బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్..

గతంలో నంధ్యాల ఉప ఎన్నిక సమయంలో చంద్రబాబు, లోకేష్ స్వయంగా ప్రచారం చేశారు.. ఇప్పడు ఏకంగా పార్లమెంట్ ఉప ఎన్నికకు పార్టీ అధినేత, సీఎం జగన్ రాకుండానే అన్ని జరిగిపోతున్నాయి అంటే.. పార్టీపై సీఎం జగన్ కు ఉన్న పట్టు ఎలాంటిదో.. జనం నాడి ఏ విధంగా పట్టేశాడో అర్థం అవుతుంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు