కరోనా సెకండ్ వేవ్ వేస్తోంది.. – సీఎం జగన్ అలర్ట్

దేశ రాజధాని మరోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుందని.. ఫ్రాన్స్, లండన్ దేశాల్లో షెట్ డౌన్

ఏపీ ప్రజలకు షాకింగ్ అండ్ అలర్ట్ న్యూస్ చెప్పారు సీఎం జగన్. కరోనాపై జిల్లా కలెక్టర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాబోయే భయంకరమైన రోజులకు సంకేతం అన్నట్లు చెప్పారు.
కరోనా సెకండ్ వేవ్ వస్తోందని.. యూరప్ మొత్తం వైరస్ తో వణికిపోతుందని.. అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రజలను కోరారు. అందుకు కావాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
దేశ రాజధాని మరోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుందని.. ఫ్రాన్స్, లండన్ దేశాల్లో షెట్ డౌన్ అయ్యాయని గుర్తు చేశారు సీఎం జగన్.

కరోనా సెకండ్ వేవ్ తో అమెరికా తీవ్ర ఇబ్బంది పడుతుందని.. ప్రపంచంలోని చాలా దేశాలు ఆందోళనగా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో స్కూల్స్, కాలేజీలు తెరిచాం కాబట్టి.. మరింత శ్రద్ధగా, జాగ్రత్తగా ఉండాలని.. విధిగా కరోనా సూచనలు పాటించాలని ప్రజలను కోరారు.

ప్రజలు అందరూ బయటకు వచ్చే సమయంలో విధిగా మాస్క్ ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని.. శానిటైజ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. సెకండ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని.. ఆస్పతుల్లో బెడ్స్ రెడీ చేయాలని కూడా కలెక్టర్లను ఆదేశించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు