సీఎం జ‌గ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌ ర‌ద్దు.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరం.. కార‌ణం ఇదే

సీఎం జ‌గ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌ ర‌ద్దు.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరం.. కార‌ణం ఇదే

cm jagan tirupati tour cancel

సీఎం జ‌గ‌న్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌ ర‌ద్దు.. ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరం.. కార‌ణం ఇదే

తిరుప‌తి ఉప ఎన్నిక కోసం 14వ తేదీ తిరుప‌తి వెళ్లాల్సిన సీఎం జ‌గ‌న్.. ఆ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌టం లేద‌ని స్ప‌ష్టం చేస్తూ లేఖ విడుద‌ల చేశారు. క‌రోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి జ‌రుగుతుంద‌ని.. రెండు రోజుల్లోనే తిరుప‌తి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీగా కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని.. ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

క‌రోనా కేసులు పెరుగుతున్న క్ర‌మంలో.. ఉప ఎన్నికల ప్ర‌చార స‌భ ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. స‌భ పెట్టిన‌ట్ల‌యితే వేలాది మంది వ‌స్తార‌ని.. దీని వ‌ల్ల క‌రోనా వైర‌స్ మ‌రింత వ్యాప్తి జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని లేఖ ద్వారా స్ప‌ష్టం చేశారు సీఎం జ‌గ‌న్.

ఏప్రిల్ 9వ తేదీ ఒక్క‌రోజే రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 765 కేసులు న‌మోద‌య్యాయ‌ని.. చిత్తూరు జిల్లాలో 496, తిరుప‌తి ప‌ట్ట‌ణంలో 200 కొత్త కేసులు వ‌చ్చాయ‌ని.. నెల్లూరు జిల్లాలో 296 కేసులు వ‌చ్చాయ‌ని లేఖ‌లో స్ప‌ష్టం చేశారు. చిత్తూరు, నెల్లూరు రెండు జిల్లాల్లోనే 24 గంట‌ల్లో న‌లుగురు క‌రోనాతో చ‌నిపోయార‌ని తెలిపారు.

ప్ర‌జారోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకుని ఉప ఎన్నిక ప్ర‌చార స‌భ ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు వివ‌రించారు సీఎం జ‌గ‌న్. నిన్న‌టికి నిన్న ప్ర‌చారంలో పాల్గొన్న టీడీపీ మాజీ ఎంపీ సంధ్యారాణి సైతం క‌రోనా బారిన ప‌డ్డారు. తిరుప‌తి ప్ర‌జ‌లు క‌రోనాతో భ‌యాందోళ‌ల‌కు గుర‌వుతున్నారు. ఈ ప‌రిస్థితుల క్ర‌మంలోనే ప్ర‌చారానికి రావ‌టం లేద‌ని వివ‌రించారు జ‌గ‌న్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు