కరోనా బారిన కేసీఆర్ కుటుంబం.. మొన్న కేసీఆర్.. నిన్న సంతోష్.. ఇవాళ కేటీఆర్.. డేంజర్ జోన్ లో ఫ్యామిలీ మెంబర్స్

కరోనా బారిన కేసీఆర్ కుటుంబం.. మొన్న కేసీఆర్.. నిన్న సంతోష్.. ఇవాళ కేటీఆర్.. డేంజర్ జోన్ లో ఫ్యామిలీ మెంబర్స్

CM KCR and minister KTR be a corona positive
CM KCR and minister KTR be a corona positive

కరోనా బారిన కేసీఆర్ కుటుంబం.. మొన్న కేసీఆర్.. నిన్న సంతోష్.. ఇవాళ కేటీఆర్.. డేంజర్ జోన్ లో ఫ్యామిలీ మెంబర్స్

కరోనా సామాన్యులకే కాదు.. ప్రముఖులను వదలటం లేదు. వారం క్రితం కరోనా బారిన పడిన తెలంగాణ కేసీఆర్.. ఆ తర్వాత వరసగా అతని ఫ్యామిలీ మొత్తానికి ఎటాక్ అవుతుంది. రెండు రోజుల క్రితం ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సిటీ స్కాన్ చేయించుకున్నారు సీఎం కేసీఆర్. కరోనా లక్షణాలు తగ్గాయని చెప్పారు డాక్టర్లు.

ఈ వార్త అలా వచ్చిన వెంటనే.. సీఎం కేసీఆర్ మేనల్లుడు, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని రావటంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.

ఆ తర్వాత రోజు అంటే.. ఏప్రిల్ 23వ తేదీన సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. కరోనాకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని వెల్లడించారు. వారం రోజులుగా తనను కలిసిన వారు.. తనతో తిరిగిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

సీఎం కేసీఆర్ ఫ్యామిలీలోని వ్యక్తులు వరసగా కరోనా బారిన పడుతున్నారు. వరసగా వారి ఫ్యామిలీ సభ్యులు బాధితులుగా మారటం కలకలం రేపుతోంది. దీంతో కేసీఆర్ ఫ్యామిలీలోని మిగతా సభ్యులు అందరూ పరీక్షలు చేయించుకుంటున్నారు.

సీఎం కేసీఆర్ ఫ్యామిలీకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక సామాన్యుల దుస్థితి ఏంటీ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లు ధనవంతులు, అధికారంలో ఉన్నోళ్లు.. పరిగెత్తుకుంటూ వచ్చి వైద్యం చేస్తారు.. మనకు అలా కాదు.. మన చావు మనం సావాల్సిందే.. బెడ్స్ కోసం.. ఆక్సిజన్ కోసం.. మందుల కోసం.. రోడ్డున పడాల్సిందే.. కార్పొరేట్ వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిందే…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు