కేసీఆర్ కు తెలియని రాజకీయమా.. పీకే ఎంట్రీ ఇస్తే.. 2024 ఓటమిని కేసీఆర్ ఇప్పుడే ఒప్పుకున్నట్లే..

కేసీఆర్ కు తెలియని రాజకీయమా.. పీకే ఎంట్రీ ఇస్తే.. 2024 ఓటమిని కేసీఆర్ ఇప్పుడే ఒప్పుకున్నట్లే..

కేసీఆర్ కు తెలియని రాజకీయమా.. పీకే ఎంట్రీ ఇస్తే.. 2024 ఓటమిని కేసీఆర్ ఇప్పుడే ఒప్పుకున్నట్లే..

2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పని చేస్తాడంటూ.. ఓ పత్రికలో క్వశ్చన్ మార్క్ తో ఓ వార్త వచ్చింది. ఈ వార్త అటూ ఇటూ తిరిగి టీఆర్ఎస్ పార్టీ నేతలకు చేరింది. ఇక్కడే అందరికీ ఒకే ఒక్క డౌట్ వచ్చింది..

కేసీఆర్ కు తెలియని రాజకీయమా.. టీఆర్ఎస్ పార్టీకి ఇంకో వ్యూహకర్త అవసరమా అంటూ అందరూ నోరెళ్లబెట్టారు. వెయ్యి మంది పీకేలు వచ్చినా.. కేసీఆర్ బుర్ర ముందు బలాదూర్.. తెలంగాణ ఉద్యమం ఏంటీ.. ఉద్యమంలో నడిపిన రాజకీయం ఏంటో.. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి.. చివరకు అదే కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయటం ఏంటీ.. తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు చేయటం ఏంటీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దండం పెట్టి వెళ్లిపోవటం ఏంటీ.. తెలంగాణలో ప్రతిపక్షం ఉందా అన్న డౌట్ జనంలోనే వచ్చింది అంటే.. కేసీఆర్ వ్యూహం మామూలుదా ఏంటీ అంటున్నారు.

ఆంధ్రా వాళ్లను రాత్రికి రాత్రి పెట్టాపేడా సర్దుకుని పంపించిన వ్యూహకర్త.. రాత్రికి ప్లాన్ వేస్తే.. ఉదయానికే బాంబులే పేలుతుంది.. తెలంగాణ గురించి కేసీఆర్ కంటే ఎక్కువ ఎవరికి తెలుసు.. అలాంటి కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ పని చేయటం ఏంటీ అంటున్నారు.

హైదరాబాద్ గడ్డపై పని చేస్తున్న ఏ పత్రిక అయినా.. టీవీ ఛానల్ అయినా టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేసే దమ్మూదైర్యం ఉన్నాయా ఏంటీ.. అంతెందుకు సోషల్ మీడియాలో ఎవరో ఒకరూ అరా తప్పితే.. ఆ 10 లక్షల మంది వాగటం తప్పితే.. సామాన్య జనం ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా ఏంటీ.. అంత దూరం వస్తే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగితే వారం రోజుల్లో సెట్ కాదా ఏంటీ అంటున్నారు టీఆర్ఎస్ నేతలు.

దేశ రాజకీయాల్లోనే స్పేస్ ఉంది.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న కేసీఆర్ వ్యూహం కంటే మించిన వ్యూహం ప్రశాంత్ కిషోర్ ఏం చేయగలడు తెలంగాణలో అంటున్నారు. తెలంగాణలోని ఆంధ్రోళ్లకు కూడా ఫుల్ క్లారిటీ ఉంది.. ఇంకెందుకు పీకే వ్యూహం అంటున్నారు. ఢిల్లీ వాళ్లకే ఏం కావాలో ఇవ్వటానికి సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్నుతుంటే.. పీకే వచ్చి తెలంగాణలో పీకేదేంటీ అంటున్నారు టీఆర్ఎస్ లీడర్స్.. నిజమే కదా.. అవును కదా…

ఇవన్నీ కాదనుకుని ప్రశాంత్ కిషోర్ ను సీఎం కేసీఆర్ వ్యూహకర్తగా పెట్టుకున్నారు అనుకుంటే మాత్రం.. 2024 ఎన్నికల్లో ఓటమిపై సీఎం కేసీఆర్ భయపడుతున్నట్లే.. ఓ రకంగా ఓడిపోవటమూ ఖాయమే.. ఎందుకంటే కేసీఆర్ దగ్గర వ్యూహాలు అయిపోయాయా లేక బుర్ర పని చేయటం లేదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు