తెలంగాణ పార్టీల మధ్యే ఆత్మగౌరవం సమస్య – ఈసారికి వాళ్లను వదిలేశారు

తెలంగాణ పార్టీల మధ్యే ఆత్మగౌరవం సమస్య - ఈసారికి వాళ్లను వదిలేశారు.. టీఆర్ఎస్ ఆత్మగౌరవంపై ఇప్పటికే బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. కేసీఆర్ పుట్టి మునుగుతుందని గ్రహించి.. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని

తెలంగాణ రాజకీయం అంటేనే ఆత్మగౌరవం అనేంతగా ప్రచారం జరిగి.. ఏపీ వాళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా.. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఏడేళ్లు అయ్యింది.. మళ్లీ ఇప్పుడు ఆత్మగౌరవం నినాదం తలెత్తింది. అది కూడా విచిత్రంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ నుంచే రావటం విశేషం. కాకపోతే విచిత్రం ఏంటంటే.. ఈసారి ఆత్మగౌరవం పుట్టింది ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా కాదు.. ఢిల్లీకి వ్యతిరేకంగా.. తెలంగాణ బీజేపీ పార్టీపై..

అంటే తెలంగాళ్ల వాళ్ల మధ్యే ఆత్మగౌరవం సమస్య వచ్చింది..
బయట నుంచి వచ్చినోడి కొడితే మనం మనం ఒక్కటి అన్న సిద్ధాంతం మారి.. ఇప్పుడు తెలంగాణ పార్టీలు – తెలంగాణ వ్యక్తుల మధ్యే ఆత్మగౌరవం అంశం తెరపైకి వచ్చింది.
టీఆర్ఎస్ ఆత్మగౌరవం నినాదం పోరాటం చేస్తుంది తెలంగాణ కోసం పోరాడిన, తెలంగాణ ఇవ్వటంలో భాగం అయిన బీజేపీపైనే కావటం విశేషం.
తెలంగాణ వాళ్ల మధ్యే పుట్టిన ఆత్మగౌరవం.. ఈసారి పక్క రాష్ట్రంతో కాకుండా జాతీయ పార్టీ బీజేపీతో చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ.
తెలంగాణ కోసం. ఆత్మగౌరవం కోసం కేంద్రంతో కొట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు అదే ఆత్మగౌరవం కోసం మరోసారి ఢిల్లీతో.. బీజేపీతో ఫైట్ చేస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీకి ఈసారి ప్రత్యర్థి ఆంధ్ర పార్టీ కాదు.. తెలంగాణ బీజేపీ అయ్యింది.
టీఆర్ఎస్ ఆత్మగౌరవంపై ఇప్పటికే బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. కేసీఆర్ పుట్టి మునుగుతుందని గ్రహించి.. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ కౌంటర్ వేసింది.

టీఆర్ఎస్ న్యూస్ ఛానళ్లు అన్నీ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని హెడ్డింగ్స్ పెడితే.. తెలంగాణ బీజేపీ ఛానల్స్ అన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ఆత్మగౌరవం సాధించుకున్నాం.. ఇప్పుడు పోరాడాల్సింది నిధుల కోసం, అభివృద్ధి కోసం అంటున్నాయి.

ప్రధాని మోడీ పర్యటనలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనటం లేదు..

ఏమైనా ఈసారికి ఆంధ్రోళ్లను వదిలేసినందుకు సంతోషం అప్పా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు