హైదరాబాద్ లో లాక్ డౌన్ లో కేసీఆర్ కీలక ప్రకటన

Health Condition Report
Health Condition Report

కరోనా సెకండ్ వేర్ వచ్చిన క్రమంలో.. తెలంగాణలో రోజువారీగా 500కు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్న సమయంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీల్లో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ముందు జాగ్రత్తగా మూసివేశాం. ఇది తాత్కాలికమే.తెలంగాణ లాక్ డౌన్ విధించే అవకాశాలు లేవు. ఆ దిశగా ఆలోచన చేయటం లేదు.ఇప్పటికే లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోయాం.. మళ్లీ లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుంది.

లాక్ డౌన్ పై ఎలాంటి తప్పుడు వార్తలు రావొద్దు ప్రజలందరూ మాస్కులు, శానిటైజర్లు వాడుతూ బౌతికదూరం పాటించాలి. స్వీయ క్రమ శిక్షణతో కరోనాను నియంత్రించగలం మార్చి 25వ తేదీ ఒక్క రోజులోనే 70 వేల కరోనా పరీక్షలు చేశాం. కరోనా సెకండ్ వేవ్ పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం సినిమా హాళ్లు, మాల్స్ లోని ధియేటర్లు మూసివేయాలన్న ఆలోచన ఇప్పటి వరకు లేదు అన్నీ వ్యాపార కార్యక్రమాలు యథావిధిగా నడుస్తాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు