ఈ బక్క కేసీఆర్ ను కొట్టటానికి దేశం మొత్తం వచ్చింది

ఈ బక్క కేసీఆర్ ను కొట్టటానికి దేశం మొత్తం వచ్చింది.. హైదరాబాద్ వచ్చి గోల్ మాల్ చేయటానికి రెడీ అయ్యారంటూ చురకలు అంటించారు బీజేపీ వాళ్లకు. పక్క రాష్ట్రం వాళ్లు ఏదో చెప్పి.. పుల్లలు పెట్టి.. తగాదాలు పెట్టి వెళతారని..

cm-kcr-comments-on-bjp-national-leaders-on-ghmc-elections
cm-kcr-comments-on-bjp-national-leaders-on-ghmc-elections

హైదరాబాద్ ఎల్బీ నగర్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తన స్పీచ్ తో అదరగొట్టారు. జాతీయ పార్టీలు దేశాన్ని పాలించటంలో ఘోరంగా విఫలం అయ్యాయని.. 70 ఏళ్ల తర్వాత ఇంకా పేదరికం ఎందుకు ఉందని.. అవినీతి ఎందుకు పెరిగింది అని ప్రశ్నించారు. కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ పార్టీల వల్లే దేశానికి ఈ దుస్థితి వచ్చిందని.. దీనిపై చర్చ జరగాలి అని మేథావులకు పిలుపునిచ్చారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ నుంచి జాతీయ నేతలు రావటంపై తనదైన స్టయిల్ లో స్పందించారు. ఈ బక్క కేసీఆర్ ను కొట్టటానికి.. ఢిల్లీ నుంచి.. యూపీ నుంచి.. బీహార్ నుంచి.. బెంగళూరు నుంచి పెద్ద పెద్దోళ్లు రావాల్సిన అవసరం ఏంటని.. అక్కడే వారి ఓటమి అర్థం అవుతుందన్నారు. వాళ్లందరూ ఎన్నికల ముందు వస్తారు.. ఎన్నికల తర్వాత వెళ్లిపోతారు.. టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇక్కడే ఉంటుంది.. జనం కోసం ప్రజల కోసం పాటుపడుతుంది అన్నారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ హైదరాబాద్ కు వచ్చారని.. ముందు ఆ రాష్ట్రమే సక్కగా లేదని.. అభివృద్ధిలో 27వ ర్యాంక్ లో ఉన్నారని.. వాళ్ల రాష్ట్రమే సరిగా లేదని.. హైదరాబాద్ వచ్చి గోల్ మాల్ చేయటానికి రెడీ అయ్యారంటూ చురకలు అంటించారు బీజేపీ వాళ్లకు. పక్క రాష్ట్రం వాళ్లు ఏదో చెప్పి.. పుల్లలు పెట్టి.. తగాదాలు పెట్టి వెళతారని.. ఆ తర్వాత జనాన్ని పట్టించుకోరని అన్నారు.

వరద సాయం కావాలని ఎవరూ అడక్కపోయినా.. వారి బాధలు చూసి 10 వేల రూపాయలు ఇవ్వటం జరిగిందన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత.. డిసెంబర్ 7వ తేదీ నుంచి మళ్లీ బాధితులు అందరికీ 10 వేల రూపాయల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు