టీఆర్ఎస్ నేతలు బాత్రూమ్ లో ఉన్నా.. అధినేతకు తెలిసిపోతుందంట..

టీఆర్ఎస్ నేతలు బాత్రూమ్ లో ఉన్నా.. అధినేతకు తెలిసిపోతుందంట..

ఏంటీ టైటిల్ చూసి వింతగా.. విడ్డూరంగా అనిపించినా ఇది నిజం అంట.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు ప్రతి కదలికను అధినేత సీఎం కేసీఆర్ ఇట్టే పట్టేస్తున్నారంట. దీంతో అబద్ధం చెబితే ఎక్కడ దొరికిపోతామో అనే ఆందోళన నేతల్లో వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలోనే ఉదయం లేచించి మొదలు.. రాత్రి వరకు రోడ్లపైనే తిరుగుతున్నారంట.

మేం ఏం చేస్తున్నామో.. ఎక్కడ ఉన్నామో.. అధినేతకు ఎలా తెలిసిపోతుంది అని రెండు రోజులు బుర్రలు బద్దలుకొట్టుకున్న టీఆర్ఎస్ నేతలు.. నిదానంగా అసలు విషయం తెలిసిందంట. జీపీఎస్ ద్వారా నేతల కదలికలను ట్రాక్ చేస్తుందంట టీఆర్ఎస్ హైకమాండ్. కార్లు, నేతల ఫోన్లకు ఉన్న జీపీఎస్ సిస్టమ్ ఆధారం ప్రచారంలోని నేతల కదలికలు తెలుసుకుని.. వారు నిజం చెబుతున్నారా.. అబద్దం చెబుతున్నారా అని నిర్థారించుకుంటున్నారంట సీఎం కేసీఆర్.

ప్రగతిభవన్ లో కూర్చుని.. టెక్నాలజీ ఆధారంగా సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారాన్ని మినిట్ టూ మినిట్ అబ్జర్వ్ చేస్తూ.. సూచనలు, సలహాలు ఇస్తున్నారంట. ఏయే గ్రామాల్లో పార్టీ బలంగా ఉంది.. ఏయే గ్రామాల్లో పార్టీకి మైనస్ ఉంది అనే విషయాలను ఇంటెలిజెన్స్ ద్వారా వివరాలు రాబట్టుకుని.. అందుకు తగ్గట్టుగా ప్రచారం వ్యూహాలను మారుస్తూ.. ఆయా గ్రామాలకు కీలకమైన నేతలను పంపించి పార్టీని ముందుకు నడిపిస్తున్నారంట.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలకు కంటిపై కునుకు లేకుండా ఉంది ప్రస్తుతం. మేం ఎక్కడ ఉన్నామో.. ఏం చేస్తున్నామో అన్నీ పెద్ద సార్ కు తెలిసిపోతున్నాయి.. చివరికి బాత్రూమ్ లో ఉన్నా కనిపెట్టేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారంట టీఆర్ఎస్ నేతలు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు