ఈ రాత్రి 8 గంటల్లోపు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ – లాక్ డౌన్ విధింపుపై ప్రకటన : హైకోర్టు వ్యాఖ్యలపై చర్చ

KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. కరోనాను జయించి.. చాలా యాక్టివ్ అయ్యారు. రెండు వారాలుగా ఫాంహౌస్ కే పరిమితం అయిన సీఎం కేసీఆర్.. మే 5వ తేదీ సాయంత్రం హైదరాబాద్ ప్రగతిభవన్ కు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి అని వార్తలు వస్తున్నా.. హైకోర్టు మాత్రం అక్షింతలు వేసింది. లక్ష పరీక్షలు కూడా చేయటం లేదని.. అలాంటప్పుడు కేసులు పెరిగాయి.. తగ్గాయి అని ఎలా చెబుతారని ప్రభుత్వాన్ని సూటిగా స్పందించింది. వీకెండ్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని.. నైట్ కర్ఫ్యూ వల్ల ఉపయోగం లేదని.. నైట్ కర్ఫ్యూ సమయం పెంచాల్సిన అవసరం ఉందని హైకోర్టు సూచించింది. వీకెండ్ లాక్ డౌన్ విషయంపై మే 7వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు.

తెలంగాణ వైద్య శాఖ సైతం సీఎం కేసీఆర్ దగ్గరే ఉంది.. ఈ క్రమంలోనే విచారణ సమయంలో హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది.. అదే విధంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ఉన్నతాధికారులతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. వీటన్నిటిపై నిర్ణయం తీసుకోవటానికి మే 5వ తేదీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధికారులతో చర్చల తర్వాత.. ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం సరిద్దుల్లోని అన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు దాదాపు లాక్ డౌన్ విధించాయి. ఆంక్షలు కఠినం చేశాయి. తెలంగాణలోనూ రెండు వారాలు అంటే.. మే 7వ తేదీ నుంచి లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు