కేసీఆర్ ను చూడండి ఒక్క రోజులో మడతపెట్టేశాడు.. మరి జగన్ ఏమో ఏడాదిగా ఎందుకు భరిస్తున్నాడు..

cm jagan about raghu rama

తెలంగాణ రాష్ట్రంలో.. టీఆర్ఎస్ పార్టీలో టాప్ ఫైవ్ (5)లో ఉండే నేతల్లో ఈటెల రాజేందర్ ఒకరు.. సీఎం కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు తర్వాత ఆ స్థాయి లీడర్ ఎవరు అంటే కచ్చితంగా ఈటెల పేరు వినిపిస్తోంది. కేసీఆర్ కుటుంబం కాకుండా చూసుకుంటే అంత పవర్ ఫుల్ లీడర్ గా ఈటెల అంటారు తెలంగాణ జనం.

ఈటెల రాజేందర్ ఏదో కుట్ర చేస్తున్నాడని.. ప్రజాస్వామ్య పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చు అంటూ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. రాజకీయం ఏం జరిగిందో ఏమోకానీ.. సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి చాలా దూరం అయ్యారని చెప్పొచ్చు. మూడు నెలలుగా ప్రభుత్వంపై, పార్టీపై బహిరంగంగా ఏమీ తిట్టకపోయినా.. నిందించకపోయినా సరే.. వేటు వేశారు సీఎం కేసీఆర్.. జస్ట్ 24 గంటల్లో ఈటెల నుంచి మంత్రి పదవి ఊడగొట్టారు.. కబ్జా నిగ్గు తేల్చారు.. ఆత్మగౌరవంపై కొట్టారు.. 100 కోట్ల ఆస్తులను దెబ్బకొట్టారు.. తెలంగాణ ఉద్యమ నేత అనే స్థాయి నుంచి తెలంగాణ ద్రోహి అనేంతగా చిత్రీకరించేశారు.. మొన్నటి వరకు వీరుడు, సూరీడు అని కీర్తించిన మీడియా ఇప్పుడు అల్పడు.. అడ్డమైనవాడు.. దొంగ, కబ్జాకోరు అంటూ తిట్లపురాణం అందుకుంది. సీఎం కేసీఆర్ తలచుకుంటే ఏమైనా చేయగలడు.. ఒక్క రోజులోనే మడతపెట్టేశాడు అంటున్నారు తెలంగాణ ప్రజలు.

సీఎం కేసీఆర్ జస్ట్ 24 గంటల్లోనే మడతపెట్టేశాడు.. కొట్టేశాడు.. మరి సీఎం జగన్ ఎందుకు ఏడాదిగా ఇంకా భరిస్తూ వస్తున్నాడు అంటున్నారు ఏపీ పీపుల్.. ఎవరి విషయం అనుకుంటున్నారా.. అదేనండీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో.. ఏడాదిగా ఎల్లో మీడియాలో యాంకర్ అవతారం ఎత్తి.. జగన్ ను తిట్టిపోస్తున్నాడు.. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎల్లో మీడియా రోజూ అతనితో లైవ్ పెట్టి.. సీఎం జగన్ ను ఆడిపోసుకుంటూ ఉండటం చూస్తూనే ఉన్నాం.. పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ అధినేతపైనే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా.. సీఎం జగన్ మాత్రం ఏమీ చేయటం లేదు.. పట్టించుకోవటం మానేసినట్లు వదిలేశారు.. వైసీపీ నేతలు సైతం చూసీచూడనట్లు.. అప్పుడప్పుడు కౌంటర్ కామెంట్లు చేస్తున్నారు. కంప్లయింట్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్లు.. లోక్ సభ స్పీకర్ కు కంప్లయింట్ చేశారు.

తెలంగాణలో పార్టీలో.. పార్టీకి వ్యతిరేకంగా తయారవుతున్నాడు అని తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ 24 గంటల్లోనే ఈటెలను మడతపెట్టేశాడు.. అలాంటిది ఏపీలో సీఎం జగన్ మాత్రం ఎందుకు ఏడాదిగా ఉపేక్షిస్తున్నాడు.. భరిస్తున్నాడు అనే టాక్ నడుస్తోంది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు