ఇదేం వింత – సీఎం కేసీఆర్ నిర్ణయంపై అవాక్కయిన జనం

ఇదేం వింత - సీఎం కేసీఆర్ నిర్ణయంపై అవాక్కయిన జనం అంత కంటే నష్టం ఏముంటుందీ వాళ్లకు అని అతి సామాన్య మహిళలు సైతం ఇళ్లల్లో మాట్లాడుకోవటం విశేషం

cm kcr shocking decision on malls and cinema halls by corona

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్నఫళంగా అన్ని స్కూల్స్, కాలేజీలు మూసివేసింది ప్రభుత్వం. అంతే కాకుండా అన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఊహించని ఈ నిర్ణయంతో జనం అవాక్కయ్యారు. ముందస్తు వ్యూహం ఉందా లేదా అనే డౌట్ వ్యక్తం అవుతుంది.

డిగ్రీ, ఇంజినీరింగ్ కు సంబంధించి ప్రస్తుతం సెమిస్టర్, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరో రెండు, మూడు సెమిస్టర్లు, మరో రెండు ఎగ్జామ్స్ అయితే అన్నీ పూర్తవుతాయి.. ఇలాంటి టైంలో వాయిదా వేయటంతో స్టూడెంట్స్ అందరూ గందరగోళానికి గురవుతున్నారు. పరీక్షల షెడ్యూల్ ఏంటీ.. ఏం పరీక్షలు జరుగుతున్నాయి అనేది తెలుసుకున్నారా లేదా.. తెలిసే వాయిదా వేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకటి, రెండు ఎగ్జామ్స్ కోసం మళ్లీ పరీక్షలు రాయాలి.. ప్రిపేర్ కావాలి అంటే కష్టమని.. అదేదో.. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత మూసివేత ప్రకటన వచ్చి ఉంటే బాగుంటుందని అంటున్నారు స్టూడెంట్స్.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్తగా స్కూల్స్, కాలేజీలు మూసివేసిన ప్రభుత్వం.. సినిమా ధియేటర్లు, మాల్స్, బార్లు, రెస్టారెంట్లు, ఆలయాల విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఏంటీ.. ఇదేం వింత అంటున్నారు జనం. ధియేటర్లు అన్నీ 100 శాతం సీటింగ్ తో నడుస్తున్నాయి.. వీకెండ్ వస్తే మాల్స్ కిటకిటలాడుతున్నాయి.. బార్లలో హడావిడి కనిపిస్తోంది.. వైన్ షాపుల దగ్గర రద్దీ ఉంది.. ఆలయాల్లో పూజలు, అభిషేకాలతో క్యూలు ఉన్నాయి.. మరి అక్కడ కరోనా రాదా అనే డౌట్ అందరికీ వస్తోంది.

ధియేటర్లు, మాల్స్, బార్లు, పబ్స్, రెస్టారెంట్లు అన్నీ ఏసీతో నడుస్తున్నాయి.. పిల్లలతోపాటు పెద్దలు వెళుతున్నారు. వాళ్లకు మాత్రం కరోనా వ్యాప్తి జరగదా.. క్లోజ్ డ్ గా ఉండే వీటి నుంచి వైరస్ వ్యాప్తి జరగదా అనే డౌట్ వస్తుంది. సినిమా ధియేటర్లు లేకపోతే టీవీల్లోనూ.. ఓటీటీల్లోనూ చూసుకుంటారు.. అంత కంటే నష్టం ఏముంటుందీ వాళ్లకు అని అతి సామాన్య మహిళలు సైతం ఇళ్లల్లో మాట్లాడుకోవటం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో పిల్లలు చనిపోయారు అనే వార్తలు ఎక్కడా లేవు.. ఎందుకంటే వాళ్లలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది.. కరోనా వచ్చినా సాధారణ జలుబు, దగ్గు లాగే ఉంటుంది.. ఇది కూడా రాకుండా ముందు జాగ్రత్తగా స్కూల్స్, కాలేజీలు, పరీక్షలు అన్నీ మూసివేయటం, వాయిదా వేయటం మంచిదే.. ఎవరూ కాదనరు.. మరి వైన్ షాపులు, బార్లు, పబ్స్, రెస్టారెంట్లు, ధియేటర్లు, మాల్స్ లో విచ్చలవిడిగా తిరుగుతున్న జనం నుంచి కరోనా వ్యాప్తి ఇంకా ఎక్కువగా జరగదా అనే ప్రశ్న అతి సామాన్యుల నుంచి వస్తుంది.

స్కూల్స్, కాలేజీలు మూసివేసిన వారు.. పరీక్షలు వాయిదా వేసిన వారు.. వీటిని మాత్రం ఎలా కొనసాగిస్తున్నారు.. వాటి విషయంలో ముందు జాగ్రత్త అవసరం లేదా.. ఇదేం వింత అంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయంపై అవాక్కయ్యారు జనం..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు