తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతున్న సీఎం కేసీఆర్ – అవసరం అయితే హైదరాబాద్ తరలించటానికి అంబులెన్స్ లు సిద్ధం

cm kcr had breathing problmes

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని.. సొంత ఫాంహౌస్ లో ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు చీఫ్ సెక్రటరీ ఏప్రిల్ 19వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజల్లో కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన, ఆవేదన వ్యక్తం అవుతుంది. అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఎంతో ఉత్సకత ప్రదర్శిస్తున్నారు ప్రజలు.

సీఎం కేసీఆర్ రాత్రంతా జలుబు, దగ్గుతో బాధపడ్డారంట. నిద్ర సరిగా పోలేదని.. అసహనంగా ఫీలయ్యారంట. పీపీఈ కిట్లతో సిద్ధం ఉన్న ప్రత్యేక వైద్య బృందం నిరంతరం దగ్గరుండి అన్నీ జాగ్రత్తలు తీసుకుంది. టైంకి మందులు అందిస్తున్నా.. రాత్రంతా జలుబు, దగ్గుతో బాధపడ్డారని సమాచారం.

ఈ క్రమంలోనే అవసరం అయితే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. ఎక్స్ కే, సిటీ స్కాన్ చేయటానికి సైతం సిద్ధం అయ్యారు వైద్యులు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేసినట్లు సమాచారం. ఫాంహౌస్ దగ్గర రెండు అంబులెన్స్ లను సైతం సిద్ధంగా ఉంచారని తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్న వైద్యులు.. మరో తొమ్మిది రోజులు అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు ఐసోలేషన్ లో ఉండాలని స్పష్టం చేస్తున్నారు.

మంగళవారం మధ్యాహ్నం వరకు చూసి.. లక్షణాలు పెరిగినా.. ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే హైదరాబాద్ తరలించి.. ప్రైవేట్ ఆస్పత్రి చికిత్స అందించటానికి అంతా సిద్ధం చేశారు అధికారులు. అంత వరకు రాకూడదని.. హోం ఐసోలేషన్ లోనే సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని అందరూ కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు అభిమానులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు