కరోనాను జయించిన సీఎం కేసీఆర్.. నెగెటివ్ రిపోర్ట్.. ఫాంహౌస్ లోనే మరిన్ని రోజులు విశ్రాంతి

కరోనాను జయించిన సీఎం కేసీఆర్.. నెగెటివ్ రిపోర్ట్.. ఫాంహౌస్ లోనే మరిన్ని రోజులు విశ్రాంతి

KCR

కరోనాను జయించిన సీఎం కేసీఆర్.. నెగెటివ్ రిపోర్ట్.. ఫాంహౌస్ లోనే మరిన్ని రోజులు విశ్రాంతి

సీఎం కేసీఆర్ కు ఫాంహౌస్ లోనే కరోనా పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ర్యాపిడ్ టెస్ట్ లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక ఆర్టీ పీసీఆర్ టెస్ట్ కోసం శాంపిల్స్ సేకరించిన డాక్టర్లు.. పరీక్షల కోసం పంపించారు. మరో 24 గంటల్లో అంటే.. ఏప్రిల్ 29వ తేదీ గురువారం ఈ రిపోర్ట్ రానుంది.

10 రోజులుగా ఫాంహౌస్ లోనే ఉండి చికిత్స పొందుతున్నారు సీఎం కేసీఆర్. కరోనా నెగెటివ్ పూర్తిగా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మరికొన్ని రోజులు ఫాంహౌస్ లో ఉండి.. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందనున్నారు.

సీఎం కేసీఆర్ కు కరోనా నెగెటివ్ అని తెలియటంతో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో ఇక మిగిలిన ఇద్దరు అయిన మంత్రి కేటీఆర్, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కోలుకోవాల్సి ఉంది. వారి కూడా కరోనా పరీక్షలు చేయటం ద్వారా.. నెగెటివ్ వస్తుంది అంటున్నారు అభిమానులు.

ఫాంహౌస్ నుంచే రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష చేస్తున్నారు సీఎం కేసీఆర్. లాక్ డౌన్ విధించాలన్న వైద్యఆరోగ్య శాఖ ప్రతిపాదనపై గురువారం కీలకమైన చర్చ జరగనుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు