సోమాజిగూడ ఆస్పత్రికి సీఎం కేసీఆర్.. చెస్ట్ ఎక్స్ రే కోసం రాక

cm ckr to somaji guda hospital

తెలంగాణ సీఎం కేసీఆర్.. ఫాం హౌస్ నుంచి హైదరాబాద్ సోమాజీగూడలోని యశోధ ఆస్పత్రికి వచ్చారు. ప్రత్యేక కాన్వాయ్ లో.. కారులోని ముందు సీట్లో కూర్చుకున్నారు కేసీఆర్. మూడు రోజులుగా కరోనాకు ఫాంహౌస్ లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అవసరం అయితే హైదరాబాద్ లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది వైద్య శాఖ.

ఏప్రిల్ 21వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్ ఆస్పత్రికి వచ్చిన సీఎం కేసీఆర్ కు.. చెస్ట్ ఎక్స్ రే తీశారు వైద్యులు. అదే విధంగా కరోనాకు సంబంధించి ఆర్టీ పీసీఆర్ పరీక్ష శాంపిల్స్ సేకరించారు. ఇతర పరీక్షలు అన్నీ చేయనున్నట్లు డాక్టర్లు. ఇందు కోసం తొమ్మిది మంది డాక్టర్ల బృందం దగ్గరుండి పర్యవేక్షించింది.

హైదరాబాద్ ఆస్పత్రిలో చెస్ట్ ఎక్స్ రే, ఇతర పరీక్షల తర్వాత తిరిగి మళ్లీ ఫాంహౌస్ లోకి వెళ్లిపోతున్నారు సీఎం కేసీఆర్. అక్కడే ట్రీట్ మెంట్ తీసుకుంటారు. ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లోనూ కరోనా నిర్థారణ, ఏ స్థాయిలో ఉంది అనేది స్పష్టంగా తెలియపోవటంతో.. విధిలేని పరిస్థితుల్లోనే లంగ్స్, చెస్ట్ ఎక్స్ రే కోసం హైదరాబాద్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది.

కారులో ఉన్న కేసీఆర్ కంటికి బాగానే కనిపిస్తున్నారు. నీరసంగా ఉన్నట్లు ఏమీ అనిపించలేదు. కేసీఆర్ వెనక సీట్లో మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు