అసెంబ్లీలో చంద్రబాబును ర్యాగింగ్ చేసిన సీఎం జగన్

అసెంబ్లీలో చంద్రబాబును ర్యాగింగ్ చేసిన సీఎం జగన్.. కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడతామా అంటూ తన సైగలతో వెటకారాలు ఆడారు.

ఏపీ అసెంబ్లీ కూల్ గా స్టార్ట్ అయ్యి.. హాట్ సాగింది. వర్షాలు, వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వారిని ఆదుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. షెడ్యూల్ ప్రకారం ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తూ రైతులను ఆదుకుంటుందని.. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని స్పష్టం చేసింది.

పంట నష్టానికి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆదుకుంటుంది అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సీట్లో నుంచి లేచి ఆగ్రహంతో ఊగిపోతూ.. చేతలు ఊపుతూ ఆవేశంతో ఊగిపోయారు.

ప్రభుత్వం వైఖరికి నిరసనగా తన సీట్లో నుంచి లేచి వచ్చి.. స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించారు.
దీనిపై సీఎం జగన్ తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు కళ్లు పెద్దవి చేసి.. చేతులు ఊపుతూ.. ఆగ్రహంతో ఊగిపోతుంటే.. కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడతామా అంటూ తన సైగలతో వెటకారాలు ఆడారు.

చంద్రబాబు వయస్సుకు తగ్గట్టు నడుచుకోవాలని.. బెదిరింపులకు దిగితే భయపడతామా అంటూ మండిపడ్డారు సీఎం జగన్.

రైతులను ఆదుకోవటానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని.. అయినా ప్రభుత్వంపైనే బెదిరింపులకు దిగుతుందని.. ఇదెక్కడి సంప్రదాయం అన్నారు సీఎం జగన్.
టీడీపీ సభ్యులు తమ సీట్లలో కూర్చోకపోతే.. మార్షల్స్ ను తీసుకొచ్చి బయటకు పంపించివేయాలని కోరారు సీఎం జగన్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు