మోడీ గుజరాత్ ప్రధానా- దేశానికా : గుజరాత్ కు కోటిన్నర.. ఏపీకి 75 లక్షల వ్యాక్సిన్లా విరుచుకుపడిన చంద్రబాబు

modi and chandrababu naidu

ప్రధాని మోడీ గుజరాత్ రాష్ట్రానికి ప్రధానా.. దేశానికి ప్రధానమంత్రా.. ఏం చేస్తున్నాడో తెలుస్తుందా.. ఇలాంద దద్దమ్మ ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదంటూ విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆరు కోట్ల జనాభా ఉన్న గుజరాత్ రాష్ట్రానికి కోటిన్నర వ్యాక్సిన్లు ఇస్తే.. 8 కోట్ల జనం ఉన్న ఏపీకి 75 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే ఇస్తారా అంటూ మండిపడ్డాడు.

దక్షిణాది రాష్ట్రాలంటే ఎందుకు చిన్నచూపు.. ఏపీ రాష్ట్రం అంటే బీజేపీకి ఎందుకు అంత కక్ష.. ఏపీ అంటేనే మోడీకి వ్యతిరేకత ఉంది.. ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పి మాటతప్పాడు.. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లు పంపిణీలోనూ ఏపీకి అన్యాయం చేస్తున్నాడు మోడీ.. ఈ గుజరాతీలను అస్సలు నమ్మకూడదు అంటూ మండిపడ్డారు చంద్రబాబు.

వ్యాక్సిన్ల పంపిణీపై ఏపీ సీఎం జగన్ సైతం విఫలం అయ్యారని.. వ్యాక్సిన్లు తెప్పించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. మోడీకి అమ్ముడుపోయాడంటూ మండపడ్డారు. సీఎం జగన్ విఫలమయినా.. దేశంలో భాగం అయిన ఏపీకి ప్రధానమంత్రి హోదా ఉండి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

గుజరాత్ రాష్ట్రానికి ఓ లెక్క.. ఏపీకి ఓ లెక్కగా వివక్ష చూపిస్తున్నారని.. జనాభా ఆధారంగా వ్యాక్సిన్లు కేటాయిస్తున్నాం అని చెప్పినప్పుడు.. గుజరాత్ కంటే.. ఏపీ ప్రజల సంఖ్య ఎక్కువ కదా.. ఎందుకు వివక్ష చూపిస్తున్నారని మోడీపై మండిపడ్డారు చంద్రబాబు. ఇప్పటికైనా కళ్లు తెరిచే వ్యాక్సిన్లు ఎక్కువ సంఖ్యలో ఏపీకి కేటాయించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఈ మేరకు మోడీకి లేఖ రాయాలని డిసైడ్ అయ్యారు బాబు..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు