ఎర్ర కోక.. తెల్ల చొక్కా.. ఇవే సీన్స్ రిపీట్.. తిరుపతిలో దొంగ ఓట్లపై ఈ ప్రశ్నలకు బదులేదీ..

ఎర్ర కోక.. తెల్ల చొక్కా.. ఇవే సీన్స్ రిపీట్.. తిరుపతిలో దొంగ ఓట్లపై ఈ ప్రశ్నలకు బదులేదీ..

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ పై దొంగ ఓట్ల రాద్ధాంతం నడుస్తోంది. పొలిటికల్ పార్టీలు నువ్వంటే నువ్వంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నా.. కామన్ మ్యాన్.. ఈ వార్తలు చిదివిన, చూసిన ప్రతి ఒక్కరికీ ఓ డౌట్ అయితే వస్తుంది.. కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి.. అవేంటో చూద్దాం..

  1. ఏప్రిల్ 17వ తేదీ పోలింగ్ రోజున తిరుపతికి అన్ని రహదారుల నుంచి 5 వేల 300 వాహనాలు వచ్చాయి.. ఇందులో కేవలం రెండు బస్సుల్లో మాత్రం ఇంటర్వ్యూలు జరిగాయి.. ఆ బస్సులే అని కచ్చితంగా వాళ్లకు ఎలా తెలిసింది.
  2. మీ అమ్మ, నాన్న పేరు ఎంటీ అని అడుగుతుంటే సైలెంట్ గా ఉన్నారు.. నవ్వుకుంటూ ఉన్నారు. అలా అనుమానం వచ్చిన వారికి పోలీసులకు ఎందుకు అప్పగించకుండా.. ఇంటర్వ్యూ చేసి బస్సులను వదిలేశారు. వాళ్లను అధికారులకు ఎందుకు అప్పగించలేదు.
  3. పోలింగ్ బూత్ దగ్గర దొంగ ఓట్లు వేస్తున్నారంటూ టీడీపీతోపాటు కొన్ని మీడియా ఛానల్స్ వాళ్లు పట్టుకుని ప్రశ్నించారు. అన్ని వీడియోలు పరిశీలించిన తర్వాత 21 మందిని పట్టుకుంటే అందరూ తెల్ల చొక్కానే వేసుకుని ఉన్నారు.
  4. ఓ పోలింగ్ బూత్ దగ్గర 30 మంది క్యూలో ఉంటే.. మధ్యలో ఉన్న ఓ కుర్రోడి దగ్గరకు వచ్చి ప్రశ్నించారు.. ఆ కుర్రోడిని పోలీసులకు అప్పగించకుండా.. వెళ్లిపో వెళ్లిపో అంటూ బెదిరించారు. ముందూ వెనకా ఉన్న 29 మందిని ఎందుకు ప్రశ్నించలేదు.వారిపై ఎందుకు అనుమానం రాలేదు.
  5. ఓ మహిళ అయితే దొంగ ఓట్లు పట్టుకున్నట్లు తెగ హడావిడి చేసింది.. మీడియా ఛానల్స్ లో హడావిడి చేసింది. ఎర్ర చీర కట్టుకున్న ఆ మహిళ ఎవరు అనేది ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు.. ఆ మహిళ వివరాలు తెలియరాలేదు. పోలింగ్ తర్వాత ఆ మహిళ కనిపించటం లేదంట.
  6. వంద మందిలోనూ ఒకే ఒక్క వ్యక్తిని పట్టుకోవటం.. బెదిరించటం.. అక్కడి నుంచి వెళ్లిపో అనటం.. పోలీసులకు అప్పగించకపోవటం.. చాలా విచిత్రంగా అనిపిస్తుంది అందరికీ.
  7. తిరుపతి పట్టణంపైనే ఫోకస్ పెట్టారు.. మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఇలాంటి డ్రైవ్ చేయకపోవటం ఏంటీ.. ఇక్కడే అందరికీ కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
  8. దొంగ ఓటు వేయటానికి వస్తే.. పోలింగ్ ఏజెంట్లు, పోలీసులు, పోలింగ్ సిబ్బంది, పోలింగ్ ఆఫీసర్.. ఇలా ఆరు ప్రక్రియలు ఉంటాయి.. ఒక్కటి అంటే ఒక్కటి కూడా పోలింగ్ బూత్ లో జరగలేదు.. అన్నీ బయటే జరిగాయి.. ఎందుకిలా జరిగింది.

ఇలాంటి సందేహాలు కామన్ మ్యాన్ కు వచ్చినవి.. వీటికి సమాధానం నేరుగా ఎవరైనా చెబితే తెలుసుకోవటానికి విజ్ణులు, ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు