బ్యాంకుల ప్రైవేటీకరణ కరెక్టే – ప్రజల స్పందన తెలిస్తే నిజమే అనిపించక మానదు..

common people support privatization

కేంద్ర ప్రభుత్వం దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయడానికో లేదా ప్రైవేటీకరణ చేయడానికి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రైవేటీకరణను వ్యతిరేఖిస్తూ దేశవ్యాప్తంగా 9 బ్యాంకులకు చెందిన 10లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు చేస్తున్న సమ్మె కారణంగా రెండు రోజుల పాటు అనేక రకాల బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె కారణంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడంపై ఉద్యోగుల అభిప్రాయాలు ఒకరకంగా ఉంటే సామన్య ప్రజల అభిప్రాయాలు మాత్రం మరో రకంగా ఉన్నాయి. ఒకసారి వారి అభిప్రాయాలు మనసులోని మాటలు ఏంటో చూద్దాం.

ప్రైవేటీకరణ చేయడం వల్ల బ్యాంకులు ప్రజలను దోచుకుంటాయి, ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు వేసి ఇబ్బందులు పెడతాయి అంటున్నారు. అది నిజమే కావచ్చు, ప్రైవేట్ బ్యాంకులు ఛార్జీలు వేసినప్పుడు వినియోగదారుడు ప్రశ్నిస్తే స్పందిస్తాయి, సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాయి. సరైన సమాచారం లేకుండా ఎస్.బి.ఐ వంటి బ్యాంకులు వేసే ఛార్జీల కంటే ప్రైవేట్ బ్యాంకులు వేసే ఛార్జీలు వంద రెట్లు బెటర్. ప్రైవేట్ బ్యాంకుల వద్ద ఛార్జీల రూపంలో పొగొట్టుకున్న డబ్బు స్థానంలో వినియోగదారుడికి సరైనా గౌరవ మర్యాదలు, ఉద్యోగుల నుండి సరైన స్పందన ఉంటాయి, ప్రభుత్వ బ్యాంకులు వద్ద డబ్బుకు, డబ్బు నష్టం ఇక ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల నుండి గౌరవ-మర్యాదలు ఎక్స్ పెక్ట్ చేయడాన్ని మించిన దారుణం మరొకటి ఉండదు.

— రమేశ్ రెడ్డి , బాలానగర్, హైదరాబాద్

ప్రభుత్వ బ్యాంకు లో సరైన స్పందన ఉండదు, పని సరిగ్గా సమయానికి జరగదు. ఒకరోజు ఒకరు సెలవులో ఉంటే ఇంకో రోజు మరొకరు సెలవులో ఉంటారు. మా అబ్బాయి స్కాలర్ షిప్ పని మీది బ్యాంక్ కి వెళితే రేపు రండి, ఎల్లుండి రండీ అంటూ వారం తిరగాల్సి వచ్చింది. ఏమైనా అంటే ఇదొక్కటే కాదు పని,ఇంకా చాలా ఉంటాయి అని అంటారు. ఇంక గట్టిగా అడిగితే అసలు అది నా డిపార్ట్ మెంట్ కాదు, ఆ పని చేయాల్సిన వారు సెలవులో ఉన్నారు రేపు రండి అంటారు. వాళ్లకి నిజంగానే పని భారం ఉంది అని అనుకుందాం అంటే పదింటింకి రావాల్సిన మేనేజర్ 11కి వస్తాడు, సరిగ్గా గంటకొట్టినట్టు నాలిగింటికి మూసి వేస్తారు, మధ్యలో ఒక గంట తినడానికి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అసలు లేదు. లాభ నష్టాల గురించి నాకు తెలియదు కాని నా ఉద్దేశంలో ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తేనే ఉద్యోగులకు బాధ్యత తెలుస్తుంది.

— సీతా రామయ్య , నక్కలరోడ్డు , విజయవాడ

ప్రభుత్వ బ్యాంకుల్లో పని చేసే వారు కొంత మంది,ఏదో తమ సొంత డబ్బు ఇస్తున్నట్టుగా ప్రవర్తిస్తారు. ఏదైనా చిన్న సాయం అడిగా విసుక్కుంటారు. ఇక చదువురాని వారు ప్రభుత్వ బ్యాంక్ కు వచ్చి పని చేయించుకోవాలి అంటే ఇక అంతే.. సాయం చేయడానికి ఒక్కరు ముందుకు రారు. ఒక పని కోసం ఒకరి దగ్గరకు వెళ్తే, ఇక్కడ కాదు అంటారు, అక్కడకు వెళ్తే ఇక్కడ కాదు అంటారు. క్యూలో నుంచోని అక్కడి దాకా వేళ్తే అది లేదు, ఇది లేదు అంటారు. అసలు ఏం ఏం వివరాలు ఇవ్వాలో ఒకే సారి చెప్పరు. ఇష్టం వచ్చినట్టు తిప్పుకుంటారు.

— హరి కృష్ణ , శ్రీకాకుళం

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు