తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత.. ఏపీ సరిహద్దులో ఆంక్షలు తొలగింపు.. 24 గంటలూ తిరగొచ్చు

telangana lockdown
telangana lockdown

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. కరోనాకు సంబంధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేస్తుంది. కర్ఫ్యూను పూర్తి స్థాయిలో ఎత్తివేసింది. యథావిధిగా 24 గంటలూ అన్ని జరిగేలా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కరోనా ఆంక్షలు అన్నింటినీ ఎత్తివేయటం ద్వారా.. జూన్ 20వ తేదీ నుంచి అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి.

2021, జూన్ 20వ తేదీ నుంచి బస్సులు, మెట్రో రైళ్లు యథావిధిగా తిరగనున్నాయి.

అన్ని ప్రభుత్వ ఆఫీసులు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించాలని ఉద్యోగులకు సీఎస్ ఆదేశం

జూలై ఒకటో తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలు ఓపెన్ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అన్ని కాలేజీలు, స్కూల్స్, ప్రైవేట్ ఇనిస్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్లు తెరవాలని కేబినెట్ డెసిషన్ తీసుకుంది.

ఆంక్షలు అన్ని ఎత్తివేయటం అంటే కరోనా తగ్గిందని కాదని.. అందరూ కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని.. శానిటైజర్ ఉపయోగించాలని.. బౌతిక దూరం పాటించాలని సూచించింది ప్రభుత్వం.

జూన్ 19వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం వెయ్యికి అటూ ఇటూగా మాత్రమే కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు సంఖ్య సైతం 3 వేలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆంక్షలు అన్ని ఎత్తివేయటం ద్వారా.. కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించటానికి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. కరోనాకు సంబంధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేస్తుంది. కర్ఫ్యూను పూర్తి స్థాయిలో ఎత్తివేసింది. యథావిధిగా 24 గంటలూ అన్ని జరిగేలా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కరోనా ఆంక్షలు అన్నింటినీ ఎత్తివేయటం ద్వారా.. జూన్ 20వ తేదీ నుంచి అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు