కౌశిక్ రెడ్డి రాజీనామా.. ఈటెల కోవర్టులు రేవంత్, పొన్నం.. డిపాజిట్లు తెచ్చుకోవాలంటూ సవాల్

కౌశిక్ రెడ్డి రాజీనామా.. ఈటెల కోవర్టులు రేవంత్, పొన్నం.. డిపాజిట్లు తెచ్చుకోవాలంటూ సవాల్

కౌశిక్ రెడ్డి రాజీనామా.. ఈటెల కోవర్టులు రేవంత్, పొన్నం.. డిపాజిట్లు తెచ్చుకోవాలంటూ సవాల్

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే మొదటి షాక్ తగిలింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి రాజీనామాతో కలకలం రేగింది. టీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకే ఇస్తున్నారంటూ ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీక్ అయిన తర్వాత.. రేవంత్ రెడ్డి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీనికి సమాధానంగా రాజీనామా చేశారు కౌశిక్ రెడ్డి. రాజీనామా ప్రకటనతోపాటు కాంగ్రెస్ పార్టీపై, పీసీసీ చీఫ్ రేవంత్, ఇతర నేతలపై తీవ్ర విమర్శలు చేశారు కౌశిక్ రెడ్డి.

> రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ తెచ్చుకోండి.
> ఈటెల రాజేందర్ తో కాంగ్రెస నేతలు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారంటూ పొన్నం ప్రభాకర్, రేవంత్ పై ఆరోపించారు.
> రేవంత్ రెడ్డికి పార్టీని బతికించే దమ్ముంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతని పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 48 డివిజన్లలో ఎందుకు డిపాజిట్లు రాలేదని ప్రశ్నించారు.
> సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం పని చేస్తుంటే.. మరొకరికి టికెట్ ఇస్తామని చెప్పటం ఏంటని నిలదీశారు.
> పొన్నం ప్రభాకర్ హుజూరాబాద్ లో పోటీ చేస్తే.. పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా దొరకరు అన్నారు.
> దొంగలా దొరికిన ఈటెల రాజేందర్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు.
> పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం రాగూర్ కు 50 కోట్ల రూపాయలు ఇచ్చి.. పీసీసీ చీఫ్ అయ్యారని రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.
> కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించింది పొన్నం ప్రభాకర్ అని.. ఇప్పుడు వార్డు మెంబర్ గా కూడా గెలవలేడని.. ఐదు నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాబట్టుకోలేకపోయాడని.. అలాంటి పొన్నం హుజూరాబాద్ లో పోటీ చేస్తాడంట అంటూ చురకలు అంటించారు.
> హుజూరాబాద్ నియోజకవర్గంలో 10 వేల కుటుంబాలతో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి.
> రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇద్దరూ కలిసి ఈటెల రాజేందర్ కు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు