హైదరాబాద్ వరద బాధితులకు రూ.50 వేలు

గతంలో ఇలా చేసే ఉన్నది.. ఉంచుకున్నది పోయిన చందం అయ్యింది అన్న సంగతి గుర్తుంచుకోవాలి

ఏంటీ షాక్ అయ్యారా.. ఇది నిజం.. పచ్చి నిజం.. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీ. 24వ తేదీ మేనిఫెస్టో విడుదల చేశారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్. అందులో ప్రధానమైన హామీ ఏంటీ అంటే.. వరదల్లో నష్టపోయిన బాధితులకు 50 వేల రూపాయల పరిహారం ఇస్తాం అని.

హైదరాబాద్ సిటీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 10 వేల రూపాయలు ఇవ్వటానికే అధికార పార్టీ చచ్చీచెడీ ఇబ్బంది పడుతుంటే.. తగుదునమ్మా అంటూ బీజేపీ 25 వేల రూపాయలు ఇస్తాం అని చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏకంగా 50 వేలు ఇస్తాం అంటోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎటూ గెలవం కదా.. ఏమైనా చెప్పొచ్చు.. ఎంత హామీ అయినా ఇవ్వొచ్చు అని అనుకున్నట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇలా చేసే ఉన్నది.. ఉంచుకున్నది పోయిన చందం అయ్యింది అన్న సంగతి గుర్తుంచుకోవాలి అంటున్నారు ప్రజలు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు