లక్షణాలు బయటపడకుండానే.. సడన్ గా కరోనాతో చనిపోతున్నారు.. ఆ కుటుంబాల్లోని విషాధం ఇదీ..

లక్షణాలు బయటపడకుండానే.. సడన్ గా కరోనాతో చనిపోతున్నారు.. ఆ కుటుంబాల్లోని విషాధం ఇదీ..

corona cases rise in india
corona cases rise in india

లక్షణాలు బయటపడకుండానే.. సడన్ గా కరోనాతో చనిపోతున్నారు.. ఆ కుటుంబాల్లోని విషాధం ఇదీ..

మీకు చేతులు జోడించి చెబుతున్నాం.. ఏపీ, తెలంగాణ అని కాదు.. దేశంలో కరోనా విలయతాండం చేస్తోంది. ఏడాది క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడే చాలా చాలా దారుణంగా ఉంది. రోజుకు లక్షన్నర కేసులు నమోదు అవుతున్నాయి. ఇది లెక్క మాత్రమే.. వాస్తవం ఎలా ఉంది అంటే.. కరోనా లక్షణాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ నాలుగు కుటుంబాల్లోని విషాధ ఘటనలను మీ.. మన జాగ్రత్త కోసం సవివరంగా ఇవ్వటం జరుగుతుంది.

ఓ విషాద కథ :

ఓ వ్యక్తి జలుబు లేదు. దగ్గు మాత్రం ఉంది. ఎందుకైనా మంచిదని కరోనా పరీక్ష చేయించుకున్నాడు. రెండు పాయింట్లు ఉంటే కరోనా.. నీకు ఒకటిన్నర పాయింట్ ఉంది. కరోనా లేదు అని చెప్పారు. ఇంటికొచ్చి.. సాధారణంగానే తిరిగాడు. సాధారణ జలుబు, దగ్గు ట్యాబ్లెట్లు తీసుకున్నాడు. కచ్చితంగా ఆరు రోజుల తర్వాత రాత్రికి రాత్రి ఊపిరి తీసుకోవటం కష్టం అయ్యింది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కరోనా తీవ్రంగా ఉంది.. ఇన్నాళ్లు ఏం చేశారు అని డాక్టర్లు ప్రశ్నించారు. ఊపిరితిత్తులకు బాగా ఎటాక్ అయ్యింది.. బతకటం కష్టం అని చెప్పారు. సరిగ్గా ఒక రోజు తర్వాత అతను చనిపోయాడు. అది కూడా కరోనాతో. లక్షణాలు లేవు.. పరీక్ష చేయించుకుంటే బయటపడలేదు.. ఇక్కడ తప్పెవరిది..

మరో విషాద కథ :

ఆ కుటుంబంలోని ఓ పెద్దామె.. వయస్సు 80 ఏళ్లు చనిపోయింది. అంత్యక్రియలకు చాలా మంది వచ్చారు. సరిగ్గా ఎనిమిది రోజుల తర్వాత ఆ ఇంటి పెద్దాయన.. వయస్సు 50 ఏళ్లు ఉంటాయి.. జలుబు, దగ్గు, జ్వరం వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే కరోనా అని చెప్పారు. ట్రీట్ మెంట్ తీసుకోవటం మొదలుపెట్టిన రెండో రోజు చనిపోయాడు. లక్షణాలు బయటపడిన రెండు రోజులకే కరోనాతో చనిపోయాడు. అదే ఇంట్లో.. కరోనాతో చనిపోయిన వ్యక్తి భార్య సైతం.. ఆ తర్వాత వారం రోజులకు చనిపోయింది. భర్తకు కరోనా అని నిర్థారణ అయిన తర్వాత ఆమె కూడా పరీక్షలు చేయించుకున్నది. పాజిటివ్ అని చెప్పారు.. ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటూ.. ఓ రాత్రి సడెన్ గా చనిపోయింది.

ఇదో విషాధ కథ :

ప్రైవేట్ ఆఫీసులో పని చేస్తూ.. రోజూ ఆఫీసుకు వచ్చి వెళుతున్నాడు. ఆఫీసులో కరోనా చాలా మందికి వచ్చిందన్న ఉద్దేశంతో.. ముందు జాగ్రత్తగా టెస్ట్ చేయించుకున్నాడు. నెగెటివ్ వచ్చింది. హమ్మయ్య అని.. సాధారణంగా హ్యాపీగా తిరిగాడు. కరోనా టెస్ట్ చేయించుకున్న.. ఆరు రోజుల తర్వాత ఒక్క రోజులోనే జ్వరం, దగ్గు విపరీతంగా వచ్చాయి. ఇంత సడెన్ గా ఏంటీ అనారోగ్యం అని వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. కరోనా టెస్ట్ చేయించుకోమంటే చేయించుకున్నాడు. నాలుగు పాయింట్లపైనే కరోనా ఉందని నిర్థారించారు డాక్టర్లు. సీరియస్ అని చెప్పారు. రెండు రోజుల ట్రీట్ మెంట్ తర్వాత చనిపోయాడు.

ఈ ఘటనలను బట్టి కరోనా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. చాలా ఉమ్మరంగా.. తీవ్రంగా ఉంది. టెస్టులు చేయించుకోవటం కాదు.. అప్రమత్తత అనేది చాలా ముఖ్యం. నమ్మి ఎవరితోనూ కలిసి తిరగొద్దు.. మాస్క్ లేకుండా ఉండొద్దు.. శానిటైజర్లు వాడండి.. బౌతిక దూరం పాటించండి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు