తెలుగు రాష్ట్రాలు మరో మహారాష్ట్రగా మారతాయా.. ఇప్పుడు మనం ఏం చేయాలంటే..

తెలుగు రాష్ట్రాలు మరో మహారాష్ట్రగా మారతాయా.. ఇప్పుడు మనం ఏం చేయాలంటే..

corona cases spread in telugu states
corona cases spread in telugu states

తెలుగు రాష్ట్రాలు మరో మహారాష్ట్రగా మారతాయా.. ఇప్పుడు మనం ఏం చేయాలంటే..

మహారాష్ట్రలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉంటే.. అక్కడి ప్రజలు దయనీయ స్థితిలోకి వెళ్లిపోయారు. కరోనా కేసులు ఒకే రోజు 20 వేలకు చేరటం.. వంద మందికిపైగా చనిపోవటంతో.. మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ తరహాలో కఠిన ఆంక్షలు విధించింది.

మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ధియేటర్లు మూసి వేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు అన్నీ క్లోజ్ చేసింది. స్విమ్మింగ్ పూల్స్ బంద్ చేసింది. స్కూల్స్, కాలేజీలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ మూసివేసింది. హోటల్స్ అన్నీ ఖాళీ చేయాలని.. కొత్తగా ఎవరికీ బుకింగ్స్ ఇవ్వొద్దని.. తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది. బస్సులు, రైళ్లు తిరిగినా.. అత్యవసరం అయితే బయటకు రావాలని స్పష్టం చేసింది అక్కడి ప్రభుత్వం. పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని ఆదేశించింది. సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని.. సీరియల్స్ షూటింగ్స్ అన్నీ బంద్ చేసుకోవాలని ఆదేశించింది. హోటల్స్ తెరిచే ఉంటాయి.. అయితే సీటింగ్ లేదని.. కేవలం పార్సిల్స్ మాత్రమే ఉంటాయని తెలిపింది. ప్రజలు అత్యవసరం అయితే బయటకు రావాలని.. వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. బార్లు, పబ్స్ మూసివేయటంతోపాటు.. వైన్ షాపుల దగ్గర సామాజిక దూరం పాటించాలని ఆదేశించింది.

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. మొదటి సారి కంటే ఇప్పుడు దయనీయంగా ఉందని.. లాక్ డౌన్ విధించకపోయినా.. అలాంటి తరహాలోనే కఠిన ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి నుంచి ఈ ఆంక్షలు అమలు చేయటం వల్ల.. కరోనాను కట్టడి చేయటానికి ప్రణాళిక రచించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడిస్తూ.. ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని వివరించింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరంగానే ఉంది. ఏపీలో 4 వేలు, తెలంగాణలో 3 వేల కొత్త కేసులు రోజువారీగా నమోదు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు.. ముఖ్యంగా ఏపీ మరో మహారాష్ట్ర కాకూడదు అనుకుంటే.. ప్రజలు వెంటనే స్వచ్చంధంగా లాక్ డౌన్ విధించుకోవాలి. ఎందుకంటే ఏపీలో ఇటీవలే స్థానిక సంస్థల వరస ఎన్నికల జరిగాయి. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతుంది. కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు వచ్చాయి.

ఏపీ, తెలంగాణ మరో మహారాష్ట్ర కాకూడదు అనుకుంటే వెంటనే ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అత్యవసరం ఏర్పడింది. లేకపోతే లాక్ డౌన్ దిశగా వెళ్లే ప్రమాదం ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు