పాజిటివ్ వచ్చినా జనంలో తిరుగుతున్న లక్ష మంది.. కరోనా వ్యాప్తికి ఇదే కారణం.. అందుకే లాక్ డౌన్ డిమాండ్

పాజిటివ్ వచ్చినా జనంలో తిరుగుతున్న లక్ష మంది.. కరోనా వ్యాప్తికి ఇదే కారణం.. అందుకే లాక్ డౌన్ డిమాండ్

corona lockdown
corona lockdown

పాజిటివ్ వచ్చినా జనంలో తిరుగుతున్న లక్ష మంది.. కరోనా వ్యాప్తికి ఇదే కారణం.. అందుకే లాక్ డౌన్ డిమాండ్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరగటానికి కారణం ఏంటో తెలుసా.. కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిన తర్వాత కూడా.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. లక్షణాలు లేవంటూ జనంలో తిరిగేయటమే కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదే కరోనా విజృంభణకు కారణం అని తేల్చారు.

కర్ణాటక రాష్ట్రం ఒక్క బెంగళూరు సిటీలోని కరోనా పాజిటివ్ వచ్చిన వారు.. ఆ తర్వాత మిస్సింగ్ అయ్యారు. ఫోన్లు స్వచ్ఛాఫ్ చేశారు. ఇలాంటి వారు 16 వేల మంది ఉన్నారని తేల్చారు అధికారులు. కర్ణాటకలోనే కాకుండా.. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు డాక్టర్లు.

సెకండ్ వేవ్ లో చాలా మంది లక్షణాలు బయటపడకుండానే కరోనా ఉంటుంది. తీవ్ర స్థాయిలో బయటపడుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. లక్షణాలు లేకుండా కరోనా సోకిందని తెలియని వారు కొందరు అయితే.. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు కదా అని తిరుగుతున్న వారు సగం మంది ఉన్నారంట. వీరి వల్లే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందంటున్నారు డాక్టర్లు, శాస్త్రవేత్తలు.

మా ఫ్యామిలీలో ఎవరికీ కరోనా లేదు.. అందరూ సేఫ్ గా ఉన్నామని భావిస్తూ.. పెళ్లిళ్లు, పేరంటాలు చేస్తున్న వారు మరికొంత మంది. బాధ్యత అందరికీ ఉండాలి కదా.. కొందరికే అయితే ఎలా అంటున్నారు. హైదరాబాద్ అత్తాపూర్ లో ఓ ఫంక్షన్ పెట్టి.. రాత్రంతా డీజేతో బీభత్సం చేశారు కుర్రోళ్లు. వీళ్లకు ఏమైనా సామాజిక బాధత్య ఉందా క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది.

లాక్ డౌన్ పెట్టండి అని ఎందుకు అంటున్నారంటే.. బాధ్యత లేకుండా తిరిగే వాళ్లు కొందరు అయితే.. వ్యాక్సిన్ కోసం వెళుతున్న వారు.. అక్కడ సామాజిక దూరం మరిచి తోపులాటలు చేసుకుంటున్నారు. ఎగబడుతున్నారు. మనిషిపై మనుషులు పడుతున్నారు. వ్యాక్సిన్ తో కరోనా దూరం అవుతుందో లేదో కానీ.. వ్యాక్సిన్ కోసం వెళ్లినోళ్లు కరోనా అంటించుకుని రావటం గ్యారెంటీ అని అక్కడి సిట్యువేషన్ కనిపిస్తోంది.

ఇలాంటి బాధ్యత లేని మనుషులు ఇంట్లోనే ఉండమని చెబితే వింటారా.. ఇలాంటోళ్ల కోసమే లాక్ డౌన్ పెట్టమని కోరుతున్నారు డాక్టర్లు. కరోనా లక్షణాలు లేవు కదా అని జనంలో ఇష్టమొచ్చినట్లు తిరిగేసి.. మిగతా వాళ్లకు ఈజీగా అంటించేస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండటమే కాదు.. మన చుట్టూ ఉన్నోళ్లు జాగ్రత్తగా లేకపోతే ఎలా అనేది ప్రశ్న.

అదే లాక్ డౌన్ పెడితే.. ఉన్నోడు.. లేనోడు అందరూ కొంపలోనే పడి చస్తారు.. లక్షణాలు లేకుండా కరోనా ఉన్నోడు ఇంకొకరికి అంటించకుండా ఉంటాడు కదా…

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు