దారుణంగా దేశ పరిస్థితులు : ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కరోనా పాజిటివ్

5 states cm suffering with corona postive

దేశంలో ఏం జరుగుతుందయ్యా.. రోజువారీగా కేసులు మూడు లక్షలకు చేరాయి.. ఓ వైపు కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు.. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.. ఆక్సిజన్ లేదు.. బెడ్స్ లేవు.. వెంటిలేటర్లు లేవు.. చికిత్స కోసం మందులు లేవు.. సామాన్యుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని అనుకుంటే.. ఈ దుస్థిని చక్కదిద్దాల్సిన రాష్ట్రాల ముఖ్యమంత్రులే కరోనా బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పుడు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్నారు.

  1. తమిళనాడు సీఎం పళనిస్వామికి కరోనా పాటిజివ్
  2. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ కు కరోనా
  3. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు పాజిటివ్
  4. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్
  5. కర్ణాటక సీఎం యడ్యూరప్పుకు కరోనా పాజిటివ్

ఈ ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాతో.. ఇళ్లల్లోనే ఉంచి చికిత్స తీసుకుంటున్నారు. మరో 15 రోజులు అధికారిక విధులకు దూరంగా ఉండనున్నారు. పరిపాలన చేసే వాళ్లే ఇలా మంచం పడితే.. ఇక సామాన్యులకు దిక్కెవరు ఇదే ఇవాల్టి ప్రజల ప్రశ్న.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ఆరోగ్య రక్షణలో ఉండే ముఖ్యమంత్రులు కరోనా బారిన పడటంతో.. ఆయా రాష్ట్ర ప్రజలు షాక్ అయ్యారు. కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చెప్పటానికి ఇది ఉదాహరణ మాత్రమే. పట్టించుకోవాల్సిన అధినేతలకే ఇలాంటి దుస్థితి వస్తే.. ఇక సామాన్యలకు దిక్కెవరు.. ఎవరి చావు వాళ్లు చావటమే.

See also : లాక్ డౌన్ దిశగా దేశం : సంకేతాలు ఇచ్చేసిన ప్రభుత్వాలు : ముఖ్యమంత్రులకే రక్షణ లేదు – జనం ప్రిపేర్ అయిపోండి.

See also : ఎన్నికల సంఘంతో కేంద్రం చర్చలు.. కొనసాగిద్దామా.. ఆపేద్దామా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు