ఈ ఏడాది పాపులర్ పదం ఇదే – కరోనా కాకపోవటం విశేషం

కరోనాతో పుట్టిన తర్వాత వచ్చిన క్వారంటైన్, ప్యాండమిక్, లాక్ డౌన్ వెతికినంతగా కరోనా గురించి...

2020 సంవత్సరం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది కరోనా వైరస్. ప్రపంచం మొత్తాన్ని ఇది మార్చేసింది. వ్యక్తులతోపాటు వ్యవస్థలను సైతం మింగేసింది కరోనా. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మాత్రం కరోనా కంటే ఎక్కువగా మరో పదం ఉపయోగించారు.. వినియోగించారు.. ఎక్కువగా మాట్లాడారు. అదేంటో తెలుసా.. క్వారంటైన్. కరోనా కంటే ఎక్కువగా క్వారంటైన్ అనే పదం పాపులర్ అయ్యింది.

కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచంలోని 700 కోట్ల మంది క్వారంటైన్ అయ్యారు. అసలు క్వారంటైన్ అంటే ఏంటీ అని 300 కోట్ల మంది ప్రత్యేకంగా ఆన్ లైన్ ద్వారా, పుస్తకాల ద్వారా, డిక్షనరీల ద్వారా దాని అర్థం తెలుసుకున్నారు. 2020, మార్చి 14 నుంచి 24 తేదీల మధ్య వందల కోట్ల మంది ఒకేసారి.. క్వారంటైన్ పదం గురించి వెతుకులాట జరిగింది.

క్వారంటైన్ తర్వాత ఎక్కువగా ఉపయోగించిన, తెలుసుకున్న మరో పదం ఏంటో తెలుసా ప్యాండమిక్. తెలుగులో మహమ్మారి అని అర్థం. భారతదేశంలో, ప్రపంచంలో ప్యాండమిక్ అర్థం వెతికారు. ఆ తర్వాత లాక్ డౌన్ అంటే ఏంటీ.. ప్రపంచంలో గతంలో ఎప్పుడైనా ఇలా పెట్టారా.. రూల్స్ ఏంటీ అని వెతికారు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు.. వీటి అన్నింటికీ కారణం కరోనా అనే పదం, వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది.. అసలు కరోనా వైరస్ అంటే ఏంటీ అని కూడా కోట్లాది మంది వెతికారు. కరోనాతో పుట్టిన తర్వాత వచ్చిన క్వారంటైన్, ప్యాండమిక్, లాక్ డౌన్ వెతికినంతగా కరోనా గురించి సెర్చ్ చేయకపోవటం విశేషం. ఎందుకంటే కరోనా అందరికీ వస్తుందో లేదో తెలియదు కానీ.. దాన్ని ప్రపంచం మొత్తం ఆగిపోయింది కదా.. తమ జీవన విధానం మారిపోయింది కదా.. అందుకే అందరూ క్వారంటైన్ అనే పదాన్ని బాగా సెర్చ్ చేసి తెలుసుకున్నారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు