కరోనా వచ్చిందని సమాచారం ఇస్తే.. పకోడీలు అమ్ముకుని వస్తానన్నాడు

కరోనా వచ్చిందని సమాచారం ఇస్తే.. పకోడీలు అమ్ముకుని వస్తానన్నాడు

pakodi corona
pakodi corona

కరోనా వచ్చిందని సమాచారం ఇస్తే.. పకోడీలు అమ్ముకుని వస్తానన్నాడు

కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్నా.. భయం, బాధ్యత లేకుండా తిరిగేస్తున్నారు జనం అనటానికి ఇదో ఎగ్జాంపుల్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన ఓ ఘటన ఔరా అనిపించింది.

కాశీబుగ్గలోని ఓ వీధిలో బండిపై పకోడీలు, బజ్జీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ వ్యక్తి. ఈ షాపు దగ్గర రోజూ కనీసం 500 మంది వచ్చి కొనుగోలు వెళుతుంటారు. రెండు రోజులుగా ఒంట్లో నలతగా ఉండటంతో.. ఎందుకైనా మంచిదని కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది.

ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది.. సదరు షాపు యజమానికి ఫోన్ చేసి.. నీకు కరోనా వచ్చింది.. వెంటనే ఆస్పత్రికి రండి.. ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయాలి అని సమాచారం ఇచ్చారు. దానికి ఆ షాపు యజమాని.. పిండి రుబ్బాల్సిన పని ఉంది.. పకోడీలు, బజ్జీలు వేయాలి.. అవి వేసి వస్తాను అంటూ సమాచారం ఇచ్చాడు..

ఈ ఒక్క మాటతో ఆస్పత్రికి సిబ్బంది షాక్ అయ్యారు. నువ్వు నీ వ్యాపారం.. కరోనా వచ్చిందిరా నాయనా అంటే.. బజ్జీలు, పకోడీలు అమ్ముకుని వస్తానంటావు అంటూ సీరియస్ అయ్యారు. వెంటనే 108 అంబులెన్స్ లో వచ్చి ఆస్పత్రి క్వారంటైన్ కు తరలించారు.

కరోనాపై నిర్లక్ష్యానికి ఇదో మచ్చుతునక.. ఈ రెండు రోజులుగా అతను ఎంత మందికి అంటించాడో.. ఎంత మంది కరోనా బారిన పడ్డారో కదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు