కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది – నెల రోజులు ఓపిక పట్టండి – ప్రపంచానికి రష్యా గుడ్ న్యూస్

గో కరోనా.. గో కరోనా అన్న పోలేదు.. ప్రపంచాన్ని పిట్టి పీడిస్తూనే ఉంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది దేవుడా అని బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్. ప్రపంచానికి ఇంది మంచి శుభవార్త చెప్పింది ఎవరో తెలుసా.. రష్యా.

2020, ఆగస్ట్ 15వ తేదీలోపు వస్తుంది :

రష్యా రాజధాని మాస్కోలోని గమలేయ ఇనిస్టిట్యూట్ – రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ అనే సంస్థ జాయింట్ గా కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు చేశాయి. రెండు నెలలుగా వ్యాక్సిన్ పై ట్రయిల్స్ కూడా జరుగుతున్నాయి. ఇటీవలే రెండో దశ ట్రయిల్స్ పూర్తయ్యాయని.. పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయని కూడా ప్రకటించింది ఈ రష్యా కంపెనీ. అన్నట్లుగానే మూడో దశ ప్రయోగాలు వేగవంతం చేసింది. ఆ ప్రయోగాలు కూడా విజయవంతంగా ముగిశాయని.. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గా ఉన్నాయని వెల్లడించింది. అనుమతుల కోసం మరికొంత కాలం వేచి చూడాలని తెలిపింది.

నెల రోజుల్లో అన్నీ అనుమతులు :

రష్యా పరిశోధన శాలల్లో తయారయిన ఈ వ్యాక్సిన్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. అంతకంటే ముందు వీరు.. ప్రభుత్వం, వైద్య శాఖ అనుమతి కోసం రిజిస్ట్రర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఆగస్ట్ మొదటి వారంలో పూర్తి అవుతుంది. ఆ తర్వాత వ్యాక్సిన్ పరిశోధన నివేదికను అధ్యయనం చేయాలి.. ఆ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిశీలనకు పంపాలి. ఇదంతా పూర్తి కావటానికి నెల రోజులు పడుతుందని రష్యా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఎక్కడా కూడా ఆలస్యం అయ్యే అవకాశం లేదని..

యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చని స్పష్టం చేస్తుంది రష్యా మీడియా. అంటే 2020, సెప్టెంబర్ మొదటి వారంలో ప్రజలకు అందుబాటులోకి రావొచ్చు అనేది బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడిస్తుంది. కరోనా వ్యాక్సిన్ కంటే ముఖ్యమైనది ప్రపంచానికి ఇప్పుడు ఏమీలేదు. సో.. తొందరగా దీనికి అనుమతి రావొచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. రిపోర్టులు అన్నీ పరిశీలించిన తర్వాతే స్పందిస్తాం అంటున్నారు భారతీయ వైద్య నిపుణులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు