ఏయే మాస్కులు ఎన్ని పెట్టుకోవాలి.. ఎలా వాడాలి.. ఏ కాంబినేషన్ మాస్కులు వాడాలి..?

ఏయే మాస్కులు ఎన్ని పెట్టుకోవాలి.. ఎలా వాడాలి.. ఏ కాంబినేషన్ మాస్కులు వాడాలి..?

double mask
double mask

ఏయే మాస్కులు ఎన్ని పెట్టుకోవాలి.. ఎలా వాడాలి.. ఏ కాంబినేషన్ మాస్కులు వాడాలి..?

మాస్క్.. కరోనా నుంచి రక్షిస్తుంది. ఇది కాదలేని వాస్తవం. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు మాస్కులు ధరించాలని సూచించింది. రెండు మాస్కుల విషయంలో భారతదేశంలో చాలా సందేహాలు ఉన్నాయని గుర్తించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.. కొత్తగా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చింది.

> రెండు మాస్కులు ధరించటం అనేది ఎంతో సురక్షితం అని చెబుతూ.. రెండూ ఒకే రకమైన మాస్కులు పెట్టుకోకూడదని స్పష్టం చేసింది. అంటే సర్జికల్ మాస్కులు రెండు ధరించకూడదు.

> క్లాత్ మాస్కులు రెండు ధరించకూడదు. ఒకే రకమైనవి ఏవైనా సరే.. రెండు మాస్కులు పెట్టుకోవటం మంచిది కాదని చెబుతోంది.

> మొదటగా సర్జికల్ మాస్క్ పెట్టుకోవాలి.. దానిపై క్లాత్ మాస్క్ పెట్టుకోవాలి. ఇలా ధరించటం వల్ల 84 శాతం సురక్షితం అని.. వైరస్ వ్యాప్తిని 84శాతం అరికడుతుందని స్పష్టం చేస్తున్నారు డాక్టర్లు.

> సాధారణ క్లాత్ మాస్క్.. ఒక్కటి మాత్రమే పెట్టుకుంటే కేవలం 42 శాతం మాత్రమే సురక్షితం అని స్పష్టం చేస్తున్నాయి అధ్యయనాలు

> సర్జికల్ మాస్క్ ఒక్కటి పెట్టుకుంటే 56శాతం మాత్రమే సుక్షితం అని స్పష్టం చేస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు