దేవుడా.. ఏంటీ కేసులు.. మూడున్నర లక్షలు పాజిటివ్.. 3 వేల మరణాలు.. ఇదో భయానకం..

దేవుడా.. ఏంటీ కేసులు.. మూడున్నర లక్షలు పాజిటివ్.. 3 వేల మరణాలు.. ఇదో భయానకం..

covid 19 cases all time high in india
covid 19 cases all time high in india

దేవుడా.. ఏంటీ కేసులు.. మూడున్నర లక్షలు పాజిటివ్.. 3 వేల మరణాలు.. ఇదో భయానకం..

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో చెప్పటానికి ఇది అంకె మాత్రమే.. ఏప్రిల్ 24వ తేదీ శనిరవారం నమోదైన కరోనా లెక్కలను ఏప్రిల్ 25వ తేదీ ఆదివారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

24 గంటల్లో 3 లక్షల 49 వేల 691 పాజిటివ్ కేసులు కొత్తగా వచ్చాయి.. అంటే మూడున్నర లక్షలు.. చనిపోయిన వారు అధికారికంగా 2 వేల 767 మంది ఉన్నారు. అనధికారికంగా ప్రభుత్వ లెక్కల్లోకి రానికి తీసుకుంటే 3 వేలకు పైగా మరణాలు ఉండొచ్చని అంచనా. దేశంలో యాక్టివ్ కేసులు 27 లక్షలుగా ఉన్నాయి. ఆల్ టైం హైగా చెబుతున్నది ప్రభుత్వం.

పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో 10 వేలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే ఒక్క రోజులో 63 వేల కోత్త కేసులు బయటపడ్డాయి. తెలంగాణ, ఏపీ, పంజాబ్, మధ్య ప్రదేశ్, గుజరాత్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో 7 నుంచి 8 వేల కేసులు నమోదు అవుతున్నాయి.

సెకండ్ వేవ్ లో నమోదు అవుతున్న కేసుల్లో అత్యధికంగా ఆక్సిజన్ వరకు వెళుతున్నారు రోగులు. ఇది ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అందరూ సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు మాత్రమే ఉన్నారని.. వీళ్ల వయస్స కూడా 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని.. ఇది చాలా ప్రమాదకరమైన సిట్యువేషన్ అంటున్నారు డాక్టర్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు