దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా – కొత్త కేసులు ఎన్నంటే…?

ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో కరోనా సెకండ్ వేవ్ భారతదేశంపై విరుచుకుపడుతుంది.మొదటి వేవ్ ప్రారంభ స్థాయిలో ఉన్నప్పటికంటే ప్రస్తుతం కరోనా కేసులో విపరీతంగా పెరిగిపోతున్నాయి.దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా - కొత్త కేసులు ఎన్నంటే...?

దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా - కొత్త కేసులు ఎన్నంటే...?

ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో కరోనా సెకండ్ వేవ్ భారతదేశంపై విరుచుకుపడుతుంది.మొదటి వేవ్ ప్రారంభ స్థాయిలో ఉన్నప్పటికంటే ప్రస్తుతం కరోనా కేసులో విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ.. ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు కారణంగానే కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది.

దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా – కొత్త కేసులు ఎన్నంటే…?

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల 13 వేల 966 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 81 వేల 466 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇక ఇదే 24 గంటల సమయంలో కరోనా కారణంగా దాదాపు 469 మంది మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. తాజాగా వెలుగు చూసిన కొత్త కేసులతో కరోనా బాధితుల సంఖ్య భారత్ లో 1 కోటి 23 లక్షల 03 వేల 131 చేరుకుంది. కాగా ఈ మొత్తం కేసుల్లో ఒక కోటి 15లక్షల 25వేల 039 మంది పూర్తిగా కోలుకోగా, 6 లక్షల 14వేల 096 యాక్టివ్ కేసులు దేశంలో కొనసాగుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీగా మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది.

దేశంలో లక్షకు పైగా కరోనా మరణాలు

దేశంలో ఇప్పటి వరకు లక్షకు పైగా కరోనా మరణాలు సంభవించినట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా భారిన పడిన వారిలో 1 లక్షా 63 వేల 396 మంది చనిపోయినట్టు అధికారులు స్పష్టం చేశారు. నమోదైన కేసుల లెక్క ప్రకారం మరణాల రేటు తక్కువ ఉండటం కొద్దిగా ఊరట కలిగించే అంశం.

గడిచిన 24 గంటల్లో నమోదైన 81,466 కేసుల్లో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదైనట్టు తెలుస్తుంది. ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 43వేల 183 మంది కరోనా భారిన పడ్డారు. అంటే మొత్తం కేసుల్లో 50 శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. ఇక ఇతర రాష్ట్రల్లోని కరోనా కేసుల సంఖ్యను గమనిస్తే కర్ణాటకలో 4 వేల 234 కేసులు, కేరళలో 2 వేల 798 కేసులు, తమిళనాడులో 2 వేల 817 కేసులు , పంజాబ్ లో 3వేల 161 కేసులు , మధ్యప్రదేశ్ లో 2 వేల 546 కేసులు, గుజరాత్ లో 2 వేల 410 కేసులు, ఆంధ్రప్రదేశ్ లో 8 వేల 142 కేసులు, తెలంగాణలో 6 వేల 159 కేసులు నమోదు అయ్యాయి.

See also : ఆంధ్రప్రదేశ్ లో భారీ స్థాయిలో బంగారు గనులు

See also : హైదరాబాద్ లో గంధపు చెట్ల స్మగ్లింగ్ కలకలం

See also : తిరుపతి ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతల క్యూ – నాగార్జునసాగర్ పరిస్థితి ఏంటీ?

See also : మోడీకి కొత్త విమానాలు వచ్చేస్తున్నాయ్.. 777.. ఒకటి కాదు మూడు

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు